'రాజకీయ లబ్ధికోసమే బీజేపీ గాంధీ సంకల్పయాత్ర'

Ponnam Prabhakar Comments On BJP Doing Gandhi Sankalpa Yatra In Karimnagar - Sakshi

పొన్నం ప్రభాకర్‌

సాక్షి, కరీంనగర్‌ : రాజకీయ లభ్ధికోసమే బీజేపీ గాంధీ సంకల్పయాత్ర చేపట్టిందని టిపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. గాంధీని చంపిన గాడ్సేను దేశభక్తుడు అంటూనే.. గాంధీ పేరుతో సంకల్ప యాత్ర చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. చంపిన వాళ్లను పూజించే బీజేపీ ఏ ముఖం పెట్టుకొని యాత్రలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని తెలిపారు. ఇప్పటికైనా కార్మికులు చేస్తున్న ఆందోళనపై స్పందించి వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. మిడ్‌ మానేరు ప్రాజెక్టులో రిపేర్లు నడుస్తుండడంతో ఎల్లంపల్లి నుంచే నీరు వృధాగా పోతుందని, వెంటనే ఆ నీటిని దారి మళ్లించి చెరువులను, కుంటలను నింపాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాబిన్నామవ్వడానికి బతుకమ్మ చీరలు తయారుచేసిన సిరిసిల్ల నేతన్నలకు డబ్బులు చెల్లించకపోవడమే నిదర్శనమని వాపోయారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top