హవ్వ... జేడీకి ఏమైంది?!

People Shock on JD Lakshmi Narayana Facebook Posts - Sakshi

ఏమిటా మాటలు..వాగ్దానాలు.. వ్యవహారం

మొన్న విశాఖను సింగపూర్‌ చేస్తామన్నారు

నిన్న ’కుల’ సమావేశాలు నిర్వహించారు

ఇప్పుడు పవన్‌ను ఏకంగా.. ఛత్రపతి శివాజీ అంటున్నారు

విద్యావంతుల్లో కూడా జేడీపై తొలగుతున్న భ్రమలు

ఎన్నికలకు వారం రోజుల ముందే జేడీ.. అదేనండీ విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ గాలి తీసిన బెలూన్‌లా రోజురోజుకు దిగజారిపోతున్నారు.దూరపు కొండలు నునుపు మాదిరిగా.. నిన్న మొన్నటి వరకు టీవీలు, పేపర్లలో ఆయన ఉపన్యాసాలు..  సందేశాలు చూసి.. అభినవ అభ్యుదయవాదిగా ఊహించుకున్న ప్రజలు.. ప్రత్యేకించి విద్యావంతులకు ఇప్పుడిప్పుడే ఆయనపై భ్రమలు తొలగిపోతున్నాయి.ఆయన ఆస్తుల చిట్టా చూసి ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులు కడిగిపారేస్తే.. కుల నేతలతో సమావేశమైన నిర్వాకం చూసి మేథావులు.. ఆయన్ను ఇప్పుడు ‘అభినయ’ అభ్యుదయవాదిగా విశ్లేషిస్తున్నారు.ఇక విశాఖను సింగపూర్‌ చేస్తానని నిన్నటి వరకు  మాట్లాడి నవ్వులపాలైన జేడీ ఇప్పుడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఏకంగా ఛత్రపతి శివాజీతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో సైతం ట్రోల్‌ అవుతున్నాయి.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే బలమైన ప్రజాకర్షక నేతల్లో ఒకరైన ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నాటి యూపీఏ సర్కారు కక్షపూరితంగా కేసులు పెట్టిన సంగతి అందరికీ తెలిసిన వాస్తవమే.. ఆ కేసుల విచారణ పేరిట ఒక్కసారిగా ’వర్గ’ మీడియా చలవతో సడెన్‌ సెలబ్రిటీగా మారిన  సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఇప్పుడు రాజకీయాల్లో ఎన్నికల ఫలితాలకు ముందే నవ్వులపాలవుతున్నారు. నిజానికి ఆయన విశాఖ జనసేన అభ్యర్ధిగా తెరపైకి రాకముందు వర్గ మీడియా సృష్టించిన ఇమేజ్‌ అంతా ఇంతా కాదు. కానీ సొంత పార్టీ పెడతానంటూ చెప్పి చివరికి  లోక్‌సత్తా టు జనసేన వయా టీడీపీగా సాగిన రాజకీయ ప్రయాణం, అర్ధరాత్రి హడావుడిగా జనసేనలో చేరి విశాఖలో వాలిపోవడంతోనే ఆయనపై విమర్శలు మొదలయ్యాయి. రాజకీయాల్లో.. అందునా పోటీ చేస్తున్న అభ్యర్థులపై ఆరోపణలు, విమర్శలు సహజమే అనుకున్నా.. జేడీ వ్యవహారశైలి మాత్రం ఆయన వేసుకున్న ముసుగును తొలగించిందనే చెప్పాలి.

తాను చిన్నప్పటి నుంచే  కులాలకు, మతాలకు వ్యతిరేకమని ప్రసంగాలు దంచికొట్టే జేడీ.. జనసేనతో జత కట్టడం..  వలసవాదులు ఉత్తరాంధ్రను దోచేస్తున్నారని డైలాగులు కొట్టి.. చివరికి ఇక్కడి నుంచే బరిలోకి దిగడంతోనే జేడీ వ్యవహారం ఉత్తరాంధ్ర మేథావుల్లో చర్చకు తెరలేపింది. ఇక ఆయన మందీమార్బలంతో నామినేషన్‌ వేసేందుకు వెళ్ళి.. పైసా కూడా ఖర్చు చేయలేదంటూ చెప్పుకొచ్చిన వ్యవహారం.. ఆనక విశాఖను సింగపూర్‌ చేసేస్తానని పలికి ప్రగల్భాలు విద్యావంతులను ఆలోచింపజేశాయి. ఇదేమిటి.. జేడీ  అంటే ఏమిటో అనుకున్నాం.. ఈయన కూడా ఫక్తు రాజకీయ నేత మాదిరే మాట్లాడుతున్నారన్న వ్యాఖ్యలు ఊపందుకున్నాయి.  నామినేషన్‌ సందర్భంగా ఆయన సమర్పించిన ఆస్తుల చిట్టా చూసి ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్ధులైతే విమర్శలు గుప్పించారు. తాను కరడుగట్టిన నిజాయితీ పరుడినని చెప్పుకునే జేడీకి ముంబైలో ఐదుకోట్ల విలువ చేసే ఫ్లాట్, హైదరాబాద్‌ శివార్లలో ఎకరాలకు ఎకరాల పొలాలు, ముప్పావు కేజీ బంగారు ఆభరణాలు, స్థిర, చరాస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నల వర్షం కురిపించారు.  వీటిపై ఎక్కడా సమాధానం చెప్పకుండా.. ఎవరు ఏ ప్రశ్న వేసినా వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పే జేడీకున్న విజ్ఞత ఏమిటన్న  ప్రశ్న కూడా సంధించారు. ఇక ఆయన ఇటీవల వాల్తేరు క్లబ్‌లోనూ, ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలోనూ ప్రత్యేకించి ఓ కులపెద్దలతో సమావేశం కావడంపైనా  విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న విశాఖ విద్యావంతులు, మేథావులు....ఇప్పుడు తాజాగా జేడీ... పవన్‌ కీర్తన చూసి తలపట్టుకుంటున్నారు.

పవన్‌... ఛత్రపతి శివాజీనట!
సినీనటుడైన పవన్‌కల్యాణ్‌ను అభిమానులు కీర్తించడం వేరు.. కానీ జేడీ సైతం పవన్‌ను కీర్తిస్తూ ఏకంగా ఛత్రపతి శివాజీగా పేర్కొనడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఆనాడు ఛత్రపతి శివాజీ కొద్ద సైన్యంతో మొఘల్‌ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టాడు..  ఈనాడు అలాంటి నాయకుడిని పవన్‌కల్యాణ్‌లో చూస్తున్నాను.. అని జేడీ అన్న మాటల వీడియోను స్వయంగా ఆయన ఫ్యాన్స్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసుకున్నారు. ఇప్పుడు ఈ పోస్టింగ్‌పై విమర్శలు చెలరేగుతున్నాయి. మూడు పెళ్ళిళ్లు చేసుకున్న పవన్‌కు.. ఛత్రపతి శివాజీకి ఏమైనా పోలిక ఉందా..  అసలేమిటి.. జేడీ ఏం మాట్లాడుతున్నారో అర్ధమవుతుందా.. ఇదేనా జేడీ స్థాయి.. జనం చాలా ఊహించుకుంటున్నారు.. ఆయనపై భ్రమలు తొలగిపోయాయ్‌... అన్న వ్యాఖ్యలు హోరెత్తుతున్నాయి.

జేడీ అనొద్దు ప్లీజ్‌
వాస్తవానికి సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా చాలా మంది అధికారులు పనిచేశారు.. ఇప్పుడూ చేస్తున్నారు. కానీ కేవలం వైఎస్‌ జగన్‌ పుణ్యమాని వీవీ లక్ష్మీనారాయణ ఒక్కసారిగా జేడీ లక్ష్మీనారాయణ అయిపోయారు. జేడీ హోదాను తప్పించి సొంత క్యాడర్‌ మహారాష్ట్రకు బదిలీ చేసిన తర్వాత అక్కడ ఐజీ, అడిషనల్‌ డీజీగా  కూడా చేశారు. అయినా సరే జేడీ అనే పేరే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఆయన కూడా జేడీ అని పిలిస్తే.. చాలా సంబరపడిపోయే వారు. కానీ ఇప్పుడు అదే పేరు ఆయన్ను భయపెడుతోంది. ఎన్నికల బ్యాలెట్‌ పేపర్లో వీవీ లక్ష్మీనారాయణ అనే ఉంటుందని, జేడీ ఉండదు కాబట్టి వచ్చే నాలుగు ఓట్లూ గల్లంతవుతాయని కంగారు పడిపోతున్నారు. అందుకే జేడీ... అతి సర్వత్రవర్జయేత్‌.. అనేది.

మరిన్ని వార్తలు

19-05-2019
May 19, 2019, 11:34 IST
‘మా పార్టీకి ఓటు వేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. మీరు ఏ పార్టీకి ఓటు వేశారో.. తెలిసిపోతుంది. రేపటి...
19-05-2019
May 19, 2019, 11:07 IST
సాక్షి, తిరుపతి : చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్‌ సందర్భంగా తొలిసారి దళితులు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని ఎమ్మెల్యే...
19-05-2019
May 19, 2019, 10:40 IST
సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సర్వేపై వైఎస్సార్ సీపీ నేత విజయసాయి రెడ్డి ట్విటర్‌...
19-05-2019
May 19, 2019, 10:13 IST
జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన నిజామాబాద్‌ ఎంపీ స్థానం ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు నాలుగు రోజుల్లో తెరపడనుంది. మరోవైపు బరిలో...
19-05-2019
May 19, 2019, 09:06 IST
సాక్షి, ఒంగోలు: కౌంటింగ్‌ గడువు దగ్గర పడుతున్న దృష్ట్యా కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లపై జిల్లా...
19-05-2019
May 19, 2019, 08:50 IST
సాక్షి, ఒంగోలు అర్బన్‌: ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్, ఎన్నికల అధికారి వినయ్‌చంద్‌ మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. స్థానిక...
19-05-2019
May 19, 2019, 08:18 IST
సాక్షి ప్రతినిధి, చెన్నై: మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రార్థిస్తూ తమిళనాడులో ఓ వ్యక్తి గేదెలతో యాగం, పూజలు నిర్వహించాడు....
19-05-2019
May 19, 2019, 07:13 IST
సార్వత్రిక ఎన్నికలు ఇంత సుదీర్ఘ కాలం నిర్వహించడం సరికాదని అన్నారు. ఎన్నికల దశల్లో రోజుల వ్యవధి ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు.
19-05-2019
May 19, 2019, 06:53 IST
కష్టాలు ఎదుర్కొన్నా.. అర్ధాకలితో అలమటించా.. మా కుటుంబానికి నాన్న చెప్పిన మాటే వేదం అనుకున్నదానికంటే ముందే రాజకీయ అరంగేట్రం చేశా ప్రజలతో మమేకమయ్యే అవకాశం...
19-05-2019
May 19, 2019, 06:50 IST
చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడుచోట్ల ఆదివారం ఉదయం 7 గంటలకు రీపోలింగ్‌ మొదలైంది.
19-05-2019
May 19, 2019, 05:20 IST
స్వతంత్ర భారత తొలి ఓటర్‌ శ్యామ్‌శరణ్‌ నేగీ(102) ఆదివారం ఓటేయనున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ నియోజకవర్గానికి చెందిన నేగీ పంచాయతీ నుంచి...
19-05-2019
May 19, 2019, 05:16 IST
కేదార్‌నాథ్‌(ఉత్తరాఖండ్‌): హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం దర్శించుకున్నారు. చివరి విడత పోలింగ్‌కు ఒక రోజు...
19-05-2019
May 19, 2019, 05:10 IST
న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాతో కలిసి పాల్గొన్న మీడియా సమావేశంలో ప్రధాని మోదీ విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోవడంపై...
19-05-2019
May 19, 2019, 05:01 IST
న్యూఢిల్లీ: బీజేపీ తనను చంపాలను కుంటోందని, మాజీ ప్రధాని ఇందిరాగాంధీని చంపినట్లే వ్యక్తిగత రక్షణ సిబ్బందే తనను హత్య చేయవచ్చని...
19-05-2019
May 19, 2019, 04:57 IST
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు పూర్తయి, ఓట్ల లెక్కింపునకు గడువు సమీపిస్తున్న సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)లో విభేదాలు బయటపడ్డాయి. నియమావళి...
19-05-2019
May 19, 2019, 04:49 IST
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల చివరిదశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. 7 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన 59 స్థానాల్లో...
19-05-2019
May 19, 2019, 04:18 IST
సాక్షి, అమరావతి: అధికార తెలుగుదేశం పార్టీ పెంపుడు చిలుక మళ్లీ పలికింది. స్వామికార్యంతోపాటు స్వకార్యం సాధించుకోవడానికి హఠాత్తుగా తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి...
19-05-2019
May 19, 2019, 03:54 IST
సాక్షి, న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రిగ్గింగ్‌ జరిగిన తీరుపై ఎన్నికలు జరిగిన మరుసటి రోజే తాము ఫిర్యాదు...
19-05-2019
May 19, 2019, 03:40 IST
సాక్షి, తిరుపతి: పాతికేళ్ల పోరాటం ఫలిస్తుందా? చిత్తూరు పెత్తందారులు నేడైనా ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోనిస్తారా? టీడీపీ నేతల రిగ్గింగ్, అక్రమాలపై...
19-05-2019
May 19, 2019, 02:11 IST
సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ఫలితాల సమయం సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల్లో టెన్షన్‌ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top