
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యాం గ స్వయంప్రతిపత్తి కలిగి న ఎన్నికల కమిషన్ టీఆర్‌ఎస్ పార్టీకి ఏజెం టులా వ్యవహరిస్తోందని సీసీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ఆరోపించారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ, ఇతర ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు మే నెలలో షెడ్యూల్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరి 4కు గడువు విధించిన ఎన్నికల కమిషన్, తెలంగాణ ప్రభుత్వం రద్దు కావడంతో దాన్ని మార్పు చేయడం సరికాదన్నారు.
పోలవరం ముంపు మండలాల విషయంలో కూడా స్పష్టత లేనందున ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ను మార్చాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికలు దగ్గరపడటంతో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు కలసి ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగడాన్ని తమ పార్టీ ఖండిస్తోందన్నారు.