నేను మొదట్నుంచీ ఇంగ్లిషే : లోకేశ్‌ | Nara Lokesh Comments On English Medium | Sakshi
Sakshi News home page

నేను మొదట్నుంచీ ఇంగ్లిషే : లోకేశ్‌

Nov 22 2019 5:20 AM | Updated on Nov 22 2019 5:47 AM

Nara Lokesh Comments On English Medium - Sakshi

మంగళగిరి : తాను తొలినుంచీ ఇంగ్లిష్‌ మీడియంలోనే చదువుకున్నానని ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ తెలిపారు. పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టింది తమ ప్రభుత్వమేనని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, మాతృభాషను కొనసాగించాలని కోరుతున్నామని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో గురువారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న లోకేశ్‌ మీడియాతో మాట్లాడారు. విద్యార్థులపై బలవంతంగా ఇంగ్లిష్‌ రుద్దడం సరికాదని అన్నారు. రెండు భాషలను కొనసాగించి, ఎంచుకునే అవకాశం తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఇవ్వాలని సూచిస్తున్నామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement