‘విద్వేషాలను సృష్టించడం ఆయనకు అలవాటు’ | Minister Avanthi Srinivas Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు

Dec 19 2019 1:05 PM | Updated on Dec 19 2019 1:13 PM

Minister Avanthi Srinivas Fires On Chandrababu - Sakshi

సాక్షి, విశాఖపట్నం:  అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ అవసరమన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా చేయడంతో ఉత్తరాంధ్ర అంతా అభివృద్ధి సాధిస్తుందన్నారు. రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా ఏపీని అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్‌ అభిమతం అని పేర్కొన్నారు. పక్క రాష్ట్రంలో యువతిపై దాడి జరిగితే.. మన రాష్ట్రంలో  దిశ చట్టం ప్రవేశపెట్టారని..ఈ చట్టం తీసుకువచ్చి మహిళలకు సీఎం వైఎస్‌ జగన్‌ అండగా ఉన్నారన్నారు. ప్రజల మధ్య కుల,రాజకీయ విద్వేషాలను సృష్టించడం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి అలవాటని మంత్రి అవంతి మండిపడ్డారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement