‘ఉత్తమ్‌ ఇంటిపై దాడి అమానుషం’

Mahakutami leaders fire on telangana police - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ వాహనాలు, అంబులెన్స్‌లు, టీ–న్యూస్‌ వాహనాల్లో డబ్బులు, మద్యం తరలిస్తున్నారని కాంగ్రెస్, టీడీపీ ఆరోపించాయి. రెండు పార్టీల నేతలు గురువారం సీఈఓ రజత్‌ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

రేవంత్‌రెడ్డి అరెస్టు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా పోలీసుల్లో మార్పురాలేదని టీటీడీపీ అధ్యక్షులు ఎల్‌.రమణ అన్నారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ఇంటిపై పోలీసులు దాడి చెయ్యడం దారుణమన్నారు. మొన్న రేవంత్‌ ఇంటిపై, గురువారం ఉత్తమ్‌ ఇంటిపై పోలీ సుల దాడులు అమానుషమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు పేర్కొన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top