
ఢిల్లీ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో కలిసి బంగ్లాదేశ్ హోంమంత్రి అసద్దుజుమాన్ ఖాన్‌కు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రాయంలో సాధర స్వాగతం పలికారు. బుధవారం అసద్దుజుమాన్ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృంధం హోంమంత్రి అమిత్ షాతో భేటి అయి వివిధ విషయాలను చర్చించనున్నారు. జమ్మూ కశ్యీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు తర్వాత వీరి భేటి జరగనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా కిషన్ రెడ్డి వెంట జాయింట్ సెక్రటరీ సత్యేంద్ర గార్గ్, బంగ్లాదేశ్ హై కమిషనర్ సైయ్యద్ మౌజెమ్ అలీ, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.