‘అందుకే చంద్రబాబు ఓడిపోయారు’ | Kishan Reddy Criticize Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

అందుకే చంద్రబాబు ఓడిపోయారు : కిషన్‌రెడ్డి

Jul 7 2019 1:47 PM | Updated on Jul 7 2019 2:58 PM

Kishan Reddy Criticize Chandrababu Naidu - Sakshi

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎవరో చెప్పలేని పరిస్థితి నెలకొందని..

సాక్షి, విజయవాడ : కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడుకి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తగిన బుద్ది చెప్పారని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఆదివారం విజయవాడలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ  సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు కిరాయి విమానాల్లో దేశమంతా తిరిగి  ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఓడిపోతారని ప్రచారం చేశారు కానీ, చివరకు ఆయన పార్టీయే ఘోరంగా ఓడిపోయి ఉన్న అధికారాన్ని కోల్పోయారని ఎద్దేవా చేశారు. పరిధికి మించి అతిగా వ్యవహరించడం వల్లనే చంద్రబాబు ఓటమి పాలయ్యారని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎవరో చెప్పలేని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. ప్రజల మద్దతుతో రెండో సారి అధికారంలోకి వచ్చిన మోదీ.. దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని ప్రశంసించారు. బీజేపీలో పాలనలో ఎక్కడా మత కలహాలు లేవన్నారు. ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ బీజేపీయే అని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. దాదాపు 13 కోట్ల మంది సభ్యత్వంతో చైనా కమ్యూనిస్టు పార్టీని మించిపోయిందన్నారు. ఏపీ అభివృద్ధికి తామ పార్టీ కట్టుబడి ఉందని,  ప్రతి పేదవాడికి ఇల్లు, తిండి, గ్యాస్‌, టాయిటెట్‌ అనే నినాదంతో బీజేపీ ముందుకు నడుస్తోందని కిషన్‌ రెడ్డి అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement