‘కేరళ వరదలను ఆయన రాజకీయాలకు వాడుకున్నారు’ | Kanna Laxminarayana Slams Chandrababu Naidu Over AP Floods | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబువి శవ రాజకీయాలు’

Aug 21 2018 7:11 PM | Updated on Aug 21 2018 7:15 PM

Kanna Laxminarayana Slams Chandrababu Naidu Over AP Floods - Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, తాడేపల్లిగూడెం: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శవాలపై కూడా రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఎర్రకాలువ ముంపు ప్రాంతాలలో పర్యటించిన అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పది రోజులగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు.  టీడీపీ ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడి ఎస్టిమేషన్లు పెంచి నాణ్యతలేని నిర్మాణాలు చేపట్టిందని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంత నష్టం జరుగుతున్నా  చంద్రబాబు ఇప్పటిదాకా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. 

కేరళ వరదలను కూడా రాజకీయంగా వాడుకోవడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శమని విమర్శించారు. ఏపీ ప్రజలను మోసం చేయడం మానుకోవాలని చంద్రబాబుకు హితవుపలికారు. జిల్లాలో నష్టపోయిన రైతులను వెంటనే గుర్తించి వారిని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చ ఇన్పుట్‌ సబ్సిడీని కౌలు రైతులకు అందించాలని, రైతుల రుణాలను వెంటనే రీషెడ్యూల్‌ చేయాలని ప్రభుత్వాన్ని కన్నా లక్ష్మీనారాయణ కోరారు.    

Advertisement
 
Advertisement
Advertisement