అందుకే టీడీపీని వీడుతున్నారు : కన్నా | Kanna Lakshminarayana Criticize Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

అందుకే టీడీపీని వీడుతున్నారు : కన్నా

Jun 25 2019 6:40 PM | Updated on Jun 25 2019 8:44 PM

Kanna Lakshminarayana Criticize Chandrababu Naidu - Sakshi

ఫిరాయింపులపై చంద్రబాబు మట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించనట్లే అవుతుందని..

సాక్షి, విజయవాడ : చంద్రబాబు నాయుడిపై విసుగుతోనే టీడీపీ నేతలు పార్టీ వీడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫిరాయింపులపై చంద్రబాబుకు మాట్లాడే హక్కు లేదన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నప్పుడు చంద్రబాబుకు ఫిరాయింపులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఫిరాయింపులపై చంద్రబాబు మట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించనట్లే అవుతుందని ఎద్దేవా చేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అభివృద్ధి చూసే టీడీపీ నేతలు బీజేపీలో చేరుతున్నారని వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement