ఉక్కు ఫ్యాక్టరీ సాధన: ఏపీ బంద్‌కు పిలుపు

Kadapa Steel Factory: YSRCP Calls For Bandh On 29th June - Sakshi

ప్రొద్దుటూరు, వైఎస్సార్‌ కడప : కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఈ నెల 29న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి గురువారం ప్రొద్దుటూరులో ప్రకటన చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఈ నెల 23న కడప, 24న బద్వేల్‌, 25న రాజంపేటల్లో వైఎస్సార్‌ సీపీ ధర్నాలు చేస్తుందని వెల్లడించారు.

26న జమ్మలమడుగులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకూ దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. 27న రహదారుల దిగ్భంధం, 29న రాష్ట్ర బంద్‌ చేపడతామని వివరించారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో బీజేపీ-టీడీపీలు ఉక్కు ఫ్యాక్టరీ ఊసేత్తలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి టీడీపీ మాట్లాడుతోందని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీ ఉక్కు ఫ్యాక్టరీని డిమాండ్ చేస్తోందని చెప్పారు. మరోవైపు చంద్రబాబు తన తప్పిదాలను బీజేపీపైకి నెడుతున్నారని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top