మహా యజ్ఞం షురూ

First Phase Polling Completed In Nationwide - Sakshi

 తొలి దశలో 91 లోక్‌సభ, 4 అసెంబ్లీలకు పోలింగ్‌ 

పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు 

బెంగాల్‌లో 81, బిహార్‌లో 51 శాతం పోలింగ్‌ నమోదు 

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఎన్నికల యజ్ఞం ప్రారంభమైంది. తొలి దశలో భాగంగా గురువారం 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 91 లోక్‌సభ స్థానాలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు నిర్వహించిన పోలింగ్‌లో కోట్లాది మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈవీఎం యంత్రాలు మొరాయించాయని, ఓటర్ల పేర్లు భారీగా గల్లంతైనట్లు వార్తలు వెలువడ్డాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఓటింగ్‌ కొనసాగుతుండగా ఓ పోలింగ్‌ బూత్‌ సమీపంలో మావోయిస్టులు ఐఈడీని పేల్చివేశారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో నలుగురు నక్సలైట్లను అరెస్ట్‌ చేసిన పోలీసులు వారి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని కైరానాలో కొందరు గుర్తింపుకార్డులు లేకుండానే పోలింగ్‌ కేంద్రంలోకి చొరబడటానికి ప్రయత్నించగా, బీఎస్‌ఎఫ్‌ జవాను గాల్లోకి కాల్పులు జరిపి వారిని నిలువరించాడు. తొలి దశలో పోటీచేసిన ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కారీ(నాగ్‌పూర్‌), హంసరాజ్‌ అహిర్‌(చంద్రాపూర్‌) కిరణ్‌ రిజిజు(అరుణాచల్‌ వెస్ట్‌), ఆర్‌ఎల్డీ చీఫ్‌ అజిత్‌ సింగ్‌(ముజఫర్‌నగర్‌) తదితరులున్నారు. ఎన్నికల గురించి తమ వేదికపై సుమారు 4.5 లక్షల సంభాషణలు జరిగినట్లు ట్విట్టర్‌ వెల్లడించింది. ఉద్యోగాలు, వ్యవసాయం, పన్నులు తదితరాల కన్నా జాతీయభద్రత గురించే ఎక్కువ చర్చ జరిగిందని, ప్రధాని నరేంద్ర మోదీ పేరు ఎక్కువగా ప్రస్తావనకు వచ్చిందని తెలిపింది. 

బెంగాల్‌లో 81 శాతం.. బిహార్‌లో 50 శాతం.. 
తొలి దశ పోలింగ్‌లో రెండు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 81 శాతం పోలింగ్‌ నమోదైంది. బిహార్‌లో అత్యల్పంగా 50 శాతం మందే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మిజోరంలో 61.95 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లాలో 35.01 శాతం, జమ్మూలో 72.16 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌(25), తెలంగాణ(17), ఉత్తరాఖండ్‌(5), ఉత్తరప్రదేశ్‌(8), మహారాష్ట్ర(7), అస్సాం(5), బిహార్‌(4), ఒడిశా(4), జమ్మూ కశ్మీర్‌(2), పశ్చిమ బెంగాల్‌(2), ఛత్తీస్‌గఢ్‌(1), మేఘాలయ(2), అరుణాచల్‌ప్రదేశ్‌(2), మిజోరం, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, అండమాన్‌ నికోబార్, లక్షద్వీప్‌లలో ఒక్కో స్థానంలో పోలింగ్‌ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌(175), అరుణాచల్‌ప్రదేశ్‌(57), సిక్కిం(32), ఒడిశా(28) అసెంబ్లీలకు కూడా తొలి దశలో ఎన్నికలు నిర్వహించారు. 

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్‌ మృతి.. 
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్‌ చనిపోగా, ఒక జవాన్‌ గాయపడ్డాడు. ఓర్చా ప్రాంతంలోని అటవీప్రాంతంలో హెలిప్యాడ్‌ వద్ద భద్రతా బలగాలు సోదాలు నిర్వహించారు. ఇదే సమయంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని డీఐజీ సుందర్‌రాజ్‌ చెప్పారు. బస్తర్‌ లోక్‌సభకు పోలింగ్‌ నేపథ్యంలో నిఘా బృందం ఈ ఆపరేషన్‌ను చేపట్టిందని తెలిపారు. పేట్రోలింగ్‌ పూర్తయిన తరువాత భద్రతా బలగాలు వెనుదిరుగుతుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారని దీంతో ఎన్‌కౌంటర్‌ జరిగిందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

19-05-2019
May 19, 2019, 11:59 IST
సాక్షి, చిత్తూరు: సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఎన్నికలను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామని...
19-05-2019
May 19, 2019, 11:58 IST
సాక్షి, తిరుపతి : చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై కేసు నమోదు అయింది. పాకాల మండలంలోని పులివర్తివారిపల్లిలో...
19-05-2019
May 19, 2019, 11:34 IST
‘మా పార్టీకి ఓటు వేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. మీరు ఏ పార్టీకి ఓటు వేశారో.. తెలిసిపోతుంది. రేపటి...
19-05-2019
May 19, 2019, 11:07 IST
సాక్షి, తిరుపతి : చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్‌ సందర్భంగా తొలిసారి దళితులు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని ఎమ్మెల్యే...
19-05-2019
May 19, 2019, 10:40 IST
సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సర్వేపై వైఎస్సార్ సీపీ నేత విజయసాయి రెడ్డి ట్విటర్‌...
19-05-2019
May 19, 2019, 10:13 IST
జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన నిజామాబాద్‌ ఎంపీ స్థానం ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు నాలుగు రోజుల్లో తెరపడనుంది. మరోవైపు బరిలో...
19-05-2019
May 19, 2019, 09:06 IST
సాక్షి, ఒంగోలు: కౌంటింగ్‌ గడువు దగ్గర పడుతున్న దృష్ట్యా కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లపై జిల్లా...
19-05-2019
May 19, 2019, 08:50 IST
సాక్షి, ఒంగోలు అర్బన్‌: ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్, ఎన్నికల అధికారి వినయ్‌చంద్‌ మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. స్థానిక...
19-05-2019
May 19, 2019, 08:18 IST
సాక్షి ప్రతినిధి, చెన్నై: మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రార్థిస్తూ తమిళనాడులో ఓ వ్యక్తి గేదెలతో యాగం, పూజలు నిర్వహించాడు....
19-05-2019
May 19, 2019, 07:13 IST
సార్వత్రిక ఎన్నికలు ఇంత సుదీర్ఘ కాలం నిర్వహించడం సరికాదని అన్నారు. ఎన్నికల దశల్లో రోజుల వ్యవధి ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు.
19-05-2019
May 19, 2019, 06:53 IST
కష్టాలు ఎదుర్కొన్నా.. అర్ధాకలితో అలమటించా.. మా కుటుంబానికి నాన్న చెప్పిన మాటే వేదం అనుకున్నదానికంటే ముందే రాజకీయ అరంగేట్రం చేశా ప్రజలతో మమేకమయ్యే అవకాశం...
19-05-2019
May 19, 2019, 06:50 IST
చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడుచోట్ల ఆదివారం ఉదయం 7 గంటలకు రీపోలింగ్‌ మొదలైంది.
19-05-2019
May 19, 2019, 05:20 IST
స్వతంత్ర భారత తొలి ఓటర్‌ శ్యామ్‌శరణ్‌ నేగీ(102) ఆదివారం ఓటేయనున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ నియోజకవర్గానికి చెందిన నేగీ పంచాయతీ నుంచి...
19-05-2019
May 19, 2019, 05:16 IST
కేదార్‌నాథ్‌(ఉత్తరాఖండ్‌): హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం దర్శించుకున్నారు. చివరి విడత పోలింగ్‌కు ఒక రోజు...
19-05-2019
May 19, 2019, 05:10 IST
న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాతో కలిసి పాల్గొన్న మీడియా సమావేశంలో ప్రధాని మోదీ విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోవడంపై...
19-05-2019
May 19, 2019, 05:01 IST
న్యూఢిల్లీ: బీజేపీ తనను చంపాలను కుంటోందని, మాజీ ప్రధాని ఇందిరాగాంధీని చంపినట్లే వ్యక్తిగత రక్షణ సిబ్బందే తనను హత్య చేయవచ్చని...
19-05-2019
May 19, 2019, 04:57 IST
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు పూర్తయి, ఓట్ల లెక్కింపునకు గడువు సమీపిస్తున్న సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)లో విభేదాలు బయటపడ్డాయి. నియమావళి...
19-05-2019
May 19, 2019, 04:49 IST
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల చివరిదశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. 7 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన 59 స్థానాల్లో...
19-05-2019
May 19, 2019, 04:18 IST
సాక్షి, అమరావతి: అధికార తెలుగుదేశం పార్టీ పెంపుడు చిలుక మళ్లీ పలికింది. స్వామికార్యంతోపాటు స్వకార్యం సాధించుకోవడానికి హఠాత్తుగా తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి...
19-05-2019
May 19, 2019, 03:54 IST
సాక్షి, న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రిగ్గింగ్‌ జరిగిన తీరుపై ఎన్నికలు జరిగిన మరుసటి రోజే తాము ఫిర్యాదు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top