సెప్టెంబర్‌ 1 నుంచి సన్నబియ్యం : కొడాలి నాని

Fine Rice Scheme Start From September 1st Kodali Nani Announced - Sakshi

సాక్షి, అమరావతి : గత టీడీపీ ప్రభుత్వం సేకరించిన బియ్యంలో నాణ్యత లేదని, 40శాతం బియ్యం తినడానికే వీలులేకుండా చేశారని పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని ఆరోపించారు. తమ ప్రభుత్వం సెప్టెంబర్‌ 1నుంచి ప్రతి పేదవాడికి నాణ్యమైన సన్నబియ్యం అందిస్తుందని చెప్పారు. సన్నబియ్యం పథకాన్ని తొలివిడతగా శ్రీకాకుళం నుంచి ప్రారంభిస్తామని వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి రాష్ట్రం మొత్తం సన్నబియ్యం పంపణీ చేస్తామన్నారు. అవినీతికి, రిసైక్లింగ్‌కి తావు లేకుండా చేసేందుకే ప్యాక్‌ చేసిన బియ్యం ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. ప్యాకింగ్‌కు రూ.250 కోట్లు ఖర్చు పెడుతుందని టీడీపీ ఆరోపిస్తుంది.. రూ.12వేల కోట్ల బియ్యం పంపిణీ చేసినప్పుడు రూ.250 కోట్లు ఖర్చు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. బియ్యం పంపిణీలో అవినీతి లేకుండా పేదలకు సరఫరా చేస్తామన్నారు. అక్టోబర్‌ 2నుంచి కొత్త రేషన్‌కార్టుల జారీ ప్రక్రియ చేపడతామని తెలిపారు. గతంలో టీడీపీ 15 లక్షల రేషన్‌ కార్డులను అనర్హులకు ఇచ్చిందని, వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామ సచివాలయాల ద్వారా కొత్త కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top