విశేషాల కొలువు.. ఉద్దండుల నెలవు..

The Earliest Legislative Affairs of Andhra Pradesh are Still Reminiscent of The Senior Citizens of The State - Sakshi

సాక్షి, ఎలక్షన్‌ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ మొట్టమొదటి శాసనసభకు సంబంధించిన విశేషాల గురించి రాష్ట్రంలోని సీనియర్‌ ప్రజాప్రతినిధులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. శాసనసభకు ఎన్నికైంది ఒకే పర్యాయమైనా ఏడేళ్ల సుదీర్ఘకాలం ఎమ్మెల్యేలుగా కొనసాగిన అరుదైన అవకాశం, ఆంధ్ర రాష్ట్రం, ఏపీ అసెంబ్లీల్లో ప్రాతినిధ్యం వహించిన రికార్డు ఆంధ్ర ప్రాంతీయులకే సొంతమైంది. 1956లో ఏర్పాటైన ఏపీ మొదటి శాసనసభ.. మూడు ప్రాంతాలకు చెందిన ఉద్దండులతో మొత్తం తెలుగువారికి వేదికగా కనిపించేది.

బూర్గుల రామకృష్ణారావు, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాల్‌రెడ్డి లాంటి తెలుగు ప్రముఖులంతా ఈ సభలో ప్రాతినిధ్యం వహించిన వారే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అంతర్భాగంగా ఉన్న సమయంలో (1952) మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. పొట్టి శ్రీరాములు ఆత్మాహుతి ఫలితంగా 1953లో శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకూ ఉన్న ప్రాంతం  ఆంధ్ర రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాష్ట్రానికి టంగుటూరి ప్రకాశం సీఎంగా ఎన్నికయ్యారు. మద్యనిషేధం అంశంపై అవిశ్వాస తీర్మానం కారణంగా ఆయన స్వల్పకాలంలోనే పదవీచ్యుతులయ్యారు.  

1955 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించడంతో ఆంధ్ర రాష్ట్రానికి బెజవాడ గోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో ఆంధ్ర, తెలంగాణా(హైదరాబాద్‌ రాష్ట్రం) కలిసి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌కు నీలం సంజీవరెడ్డి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. 1957లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.తెలంగాణా ప్రాంతంలోని 104 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే 1957లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. ఆంధ్ర ప్రాంతంలో ఉప ఎన్నికలు జరిగి రెండేళ్లు మాత్రమే అయినందున 1957 సార్వత్రిక ఎన్నికలు ఇక్కడ నిర్వహించలేదు. ఫలితంగా ఆంధ్ర ప్రాంతం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు 1955 నుంచి 1962 వరకూ సుమారు ఏడున్నరేళ్లపాటు శాసనసభ్యులుగా కొనసాగారు. ఇలా ఆంధ్రప్రదేశ్‌ మొదటి అసెంబ్లీ మూడు పర్యాయాలు ఎన్నికైన (1952, 1955, 1957) వారికి వేదికగా నిలిచి ప్రత్యేకతను సంతరించుకుంది. 

ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు సీఎం కావడం మొదటి శాసనసభలో కనిపించిన అరుదైన విశేషాల్లో ఒకటిగా చెప్పవచ్చు. నీలం సంజీవరెడ్డి.. తర్వాత కాలంలో దేశ ప్రథమ పౌరునిగా అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించగా పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు.

ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన బెజవాడ గోపాల్‌రెడ్డి తన కింద ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి వద్ద తర్వాత మంత్రిగా పనిచేయడం ఈ కాలంలో చోటుచేసుకొన్న మరో ఆసక్తికర సన్నివేశం. 
1955 నుంచి 1962 వరకూ ఏడేళ్లు సభలో ఉన్న వారిలో గౌతు లచ్చన్న, పీవీజీ రాజు, పుచ్చల పల్లి సుందరయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, కడప కోటిరెడ్డి, ఆనం చెంచు సుబ్బారెడ్డి ప్రముఖులు ఉన్నారు.1952, 1955లో తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచినవారు కూడా మొదటి శాసనసభలో ఉన్నారు.  

– లేబాక రఘురామిరెడ్డి, సాక్షి ప్రతినిధి 

మరిన్ని వార్తలు

20-03-2019
Mar 20, 2019, 08:28 IST
మార్కెటింగ్‌కైనా, ఎన్నికల వ్యూహాలకైనా బ్రాండింగే ముఖ్యం. మరి ఆ రెండూ కలిపి రాజకీయాన్ని మార్కెట్‌ రంగం లోకి  తెస్తే ఇక...
20-03-2019
Mar 20, 2019, 08:24 IST
సాక్షి, పిఠాపురం : ‘అధికారంలోకి వస్తే మేం అడిగిందల్లా ఇస్తానన్నారు. నన్ను నమ్మండంటూ కన్నీరెట్టుకున్నారు. తీరా గెలిపిస్తే మేమెవరో కూడా తెలీదన్నట్టు చూస్తున్నారు....
20-03-2019
Mar 20, 2019, 08:21 IST
ఫుట్‌బాల్‌ అంటే ఆయనకి ఆరో ప్రాణం. పొలిటికల్‌ గ్రౌండ్‌లో తన రాజకీయ వ్యూహాలతో ప్రత్యర్థుల్ని ఫుట్‌బాల్‌ ఆడేస్తారు. మల్లయోధుడైన కన్నతండ్రి...
20-03-2019
Mar 20, 2019, 08:10 IST
సాక్షి, నరసాపురం: నరసాపురం తెలుగుదేశం పార్టీలో ‘కొత్త’ చిచ్చు రాజుకుంది. నరసాపురం అసెంబ్లీ స్థానాన్ని సీఎం చంద్రబాబు సిట్టింగ్‌ ఎమ్మెల్యే బండారు...
20-03-2019
Mar 20, 2019, 08:08 IST
నవ్యాంధ్ర  నిర్మిస్తా... నాతో కలిసి రండి..అంటే.. నిజమేనని నమ్మాం..కొత్త రాష్ట్రం– కోటి సమస్యలు.. 40ఏళ్ల అనుభవం ఉంది..ఆంధ్రావనిని స్వర్ణాంధ్రగా మారుస్తానంటే..సరేలే...
20-03-2019
Mar 20, 2019, 08:04 IST
సాక్షి, అమరావతి : ఉదయాన్నే రాష్ట్ర పౌరులు ఎవరి పనుల్లో వాళ్లున్నారు. పేపర్‌ చూసే పనిలో ఉన్న ఓ పౌరుడు సడన్‌గా...
20-03-2019
Mar 20, 2019, 08:04 IST
సాక్షి, కొవ్వూరు: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జిల్లాలో నరసాపురం, పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు...
20-03-2019
Mar 20, 2019, 07:57 IST
సాక్షి, ఆచంట: ఆయ్‌.. మాకు ఒకరు ఎక్కువా కాదు.. మరొకరు తక్కువా కాదు.. అన్ని రాజకీయ పార్టీలు సమానమే అంటున్నారు ఆచంట...
20-03-2019
Mar 20, 2019, 07:54 IST
‘హుద్‌హుద్‌ సృష్టించిన బీభత్సం కంటే నవ్యాంధ్రలోని ఏకైక మహానగరం విశాఖపట్టణానికి ఈ ఐదేళ్లలో భూబకాసురులు కోలుకోలేనంత నష్టం చేకూర్చారు. ఉత్తరాంధ్రను...
20-03-2019
Mar 20, 2019, 07:51 IST
అదరకుండా... బెదరకుండా...  దారుణ నిర్బంధానికి ఎదురొడ్డి... రీతి లేని సర్కారును నిలదీస్తూ...  ఐదు కోట్ల ఆంధ్రుల గొంతుకగా... హోదానే హద్దంటూ ఎలుగెత్తి నినదిస్తూ...  దీక్షబూని సాగుతూ... సింహంలా...
20-03-2019
Mar 20, 2019, 07:47 IST
సాక్షి, అమరావతి బ్యూరో : కాలంతో పాటే అడుగులేస్తూ రాజకీయ నాయకులు ఆధునిక సాంకేతికత వినియోగానికి ఉత్సాహం చూపుతున్నారు. ఆన్‌లైన్‌...
20-03-2019
Mar 20, 2019, 07:41 IST
సాక్షి, చిత్తూరు :ఎన్నికలు రావడంతో ‘గిఫ్ట్‌’ సమర్పించుకోవాలని చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభను పార్టీ అధిష్టానం ఆదేశించడం ఆ...
20-03-2019
Mar 20, 2019, 07:37 IST
సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో ఇంకో రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. జమ్మూ కశ్మీర్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్‌...
20-03-2019
Mar 20, 2019, 07:22 IST
సాక్షి ప్రతినిధి, ఏలూరు: చివరి నిమిషం వరకూ నాన్చి నిడదవోలు, నరసాపురం సీట్లు సిట్టింగ్‌లకే కేటాయించడంతో టీడీపీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి....
20-03-2019
Mar 20, 2019, 07:19 IST
ఎన్నికల రోజు వచ్చేసరికి చంద్రబాబు ఒక పెద్ద డ్రామాకు తెరలేపుతారు. ప్రతి చేతిలోనూ రూ.3 వేలు పెడతారు. అవ్వా, తాతా, అక్కా,...
20-03-2019
Mar 20, 2019, 07:15 IST
సాక్షి, అమరావతి: ఎన్నికలు మొదలైన తొలి దశకంలో కొన్నిచోట్ల ద్విసభ్య (ఇద్దరు సభ్యుల) నియోజకవర్గాలు ఉండేవి. వాటిలో ఒకటి ఎస్సీలకు, మరొకటి...
20-03-2019
Mar 20, 2019, 07:15 IST
సాక్షి, ఏలూరు టౌన్‌ : ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాల్సి రావటం.. ఎన్నికల విధులను సక్రమంగానే నిర్వర్తిస్తున్నామని కలరింగ్‌...
20-03-2019
Mar 20, 2019, 07:10 IST
అది 2018 జులై...మంత్రి లోకేశ్‌ (చినబాబు) కర్నూలు వస్తున్నారని స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే బుట్టా రేణుక, ఎస్వీ మోహన్‌రెడ్డి తెగ...
20-03-2019
Mar 20, 2019, 07:02 IST
విశాఖపట్నం... ప్రకృతి గీసిన అందమైన నగరం. అయితే కొన్నేళ్లుగా విశాఖలో నేరసంస్కృతి విజృంభిస్తోంది.. గొడవలు, ఘర్షణలు నిత్యకృత్యమైపోయాయి. పాతికేళ్ల క్రితమే...
20-03-2019
Mar 20, 2019, 07:02 IST
సాక్షి, గుంటూరు :జిల్లాలో ప్రముఖ విద్యాకేంద్రంగా, చైతన్యవంతమైన రాజకీయాలకు పేరు పొందిన నరసరావుపేట దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. కాకలు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top