ఓటరు నమోదుపై దృష్టి సారించండి  | Do Focus on voter registration | Sakshi
Sakshi News home page

ఓటరు నమోదుపై దృష్టి సారించండి 

May 6 2018 1:25 AM | Updated on Sep 19 2019 8:44 PM

Do Focus on voter registration - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పోలింగ్‌బూత్‌కు సంబంధించిన ఓటరు లిస్టును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులను కోరారు.

మరోవైపు రాష్ట్రంలోని రైతుల సమస్యల పరిష్కారం, సలహాల కోసం కాంగ్రెస్‌ పార్టీ రైతు హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది. 040–24601254 నంబర్‌తో ఏర్పాటు చేసిన ఈ హెల్ప్‌లైన్‌ను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గాంధీభవన్‌లో ప్రారంభించారు. .

Advertisement
 
Advertisement
Advertisement