ఏపీలో హిజ్రాలకు ఇక రూ.1500 పెన్షన్‌ | to day ap cabinet decisions | Sakshi
Sakshi News home page

ఏపీలో హిజ్రాలకు ఇక రూ.1500 పెన్షన్‌

Dec 16 2017 7:32 PM | Updated on Aug 21 2018 6:10 PM

to day ap cabinet decisions - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా తొమ్మిది మండలాలు ఏర్పాటుచేసేందుకు ఏపీ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీని ఆమోదానికి గవర్నర్‌కు పంపించనున్నారు. అలాగే, 2014 పోలీస్‌ యాక్ట్‌ సవరణకు ఆమోదం తెలిపింది. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో పలువురు కేబినెట్‌ మంత్రులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా హిజ్రాలకు పదిహేను వందల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఇళ్ళ స్థలాలు, రేషన్ కార్డులు ఇవ్వాలని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు.

Advertisement
 
Advertisement
Advertisement