మళ్లీ కాంగ్రెస్‌లోకి డీఎస్‌?..

D Srinivas Rejoin In Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్‌ మళ్లీ కాంగ్రెస్‌లో చేరబోతున్నారా?. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే అవుననే చెప్పాలి. ఈ గురువారం టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి డీఎస్‌తో సమావేశం అయ్యారు. తిరిగి పార్టీలోకి రావాలని ఉత్తమ్‌ డీఎస్‌ను ఆహ్వానించారు. ఈ ఉదయం డీఎస్‌ ఇంటికి వెళ్లిన ఉత్తమ్‌ ఆయనతో భేటీ అయ్యారు.

దాదాపు 45 నిమిషాలపాటు చర్చలు జరిపినట్లు సమాచారం. త్వరలో రాహుల్‌ గాంధీతో డీ శ్రీనివాస్‌ భేటీ కానున్నారు. గతంలో డీఎస్‌పై నిజమాబాద్‌ నేతలు కేసీఆర్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన కొద్దిరోజులుగా టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్నారు.  

కాంగ్రెస్‌లోకి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి
నిజామాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. రేపు ఢిల్లీలో రాహుల్‌ గాంధీ సమక్షంలో పార్టీలో చేరికకు రంగం సిద్దం అయినట్లు తెలుస్తోంది. భూపతిరెడ్డికి నిజామాబాద్‌ రూరల్‌ టికెట్‌ కేటాయించినట్లు సమాచారం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top