
వైఎస్ జగన్‌ను ప్రముఖ హీరో, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరంజీవి ఫోన్‌లో పరామర్శించారు.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని శనివారం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పరామర్శించారు. వైఎస్ జగన్‌ను ప్రముఖ హీరో, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరంజీవి ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా వైఎస్ జగన్‌ను ఫోన్‌లో పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కాగా, వైఎస్ జగన్‌కు సిటీ న్యూరో ఆస్పత్రి వైద్యులు ఈరోజు మరోసారి పరీక్షలు నిర్వహించారు. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. ఆయనకు విశ్రాంతి అవసరమని చెప్పారు.
సంబంధిత కథనాలు