ఫ్లెక్సీపై మరోడ్రామా! | Another drama on Flexi of YS Jagan | Sakshi
Sakshi News home page

ఫ్లెక్సీపై మరోడ్రామా!

Oct 27 2018 4:24 AM | Updated on Oct 27 2018 4:24 AM

Another drama on Flexi of YS Jagan - Sakshi

హత్యాయత్నం జరిగిన రోజున హడావిడిగా విడుదల చేసిన ఫ్లెక్సీ, గుట్టుబయటపడిపోవడంతో ఇదిగో పాత ఫ్లెక్సీ అంటూ మరొకటి తెరపైకి

సాక్షి, అమరావతి: ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం చేసిన శ్రీనివాస్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అని, జగన్‌ అభిమాని అని చెప్పడానికి గ్రాఫిక్స్‌ బొమ్మలతో  ఫ్లెక్సీ నాటకానికి తెరలేపి అభాసుపాలైన ప్రభుత్వం శుక్రవారం మరో ప్లెక్సీని తెరపైకి తెచ్చి మళ్లీ నవ్వులపాలైంది. జగన్‌తో శ్రీనివాస్‌ కలసి ఉన్నట్లుగా హేపీ న్యూ ఇయర్, పొంగల్‌ అంటూ గురువారం ఫోన్లలో ఫొటోలను విడుదల చేయించిన సంగతి తెలిసిందే. అయితే పది నెలల క్రితం నాటిది కాదని, అది గ్రాఫిక్స్‌లో తాజాగా రూపొందించినదని తేలిపోవడంతో శుక్రవారం మరో నాటకానికి పోలీసుల ద్వారా తెరలేపారు. నిందితుడి స్వగ్రామానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) మీడియాను తీసుకువెళ్లి అక్కడ పొలాల్లో ఫ్లెక్సీ పడిఉందంటూ చూపించి వీడియోలు తీయించారు.

ఆ వీడియోను సోషల్‌ మీడియా ద్వారా మళ్లీ ప్రచారంలోకి తెచ్చారు. అయితే అంతకు ముందురోజు వరకు లేని ఫ్లెక్సీ అప్పటికప్పడు పొలాల్లోకి ఎలా వచ్చిందన్నది ప్రశ్న.కానీ శుక్రవారం చీలికలతో, నలిగిపోయి పొలంలో పడిఉన్న ఫ్లెక్సీని పోలీసులు మీడియాకు చూపించి దాన్నే వీడియో తీయించారు. అయితే ఒక వ్యక్తి చినిగిపోయి ఉన్నట్లు ఉన్న ఓ ఫ్లెక్సీని శ్రీనివాస్‌ ఇంట్లోకి తీసుకువెళ్లి ఆ తరువాత దాన్ని మడతపెట్టి తీసుకువెళ్లారు. ఆ వ్యక్తి ఫ్లెక్సీ తెస్తున్న దృశ్యాలు సాక్షి మీడియాకు చిక్కాయి. దీంతో శుక్రవారం నాటి ఫ్లెక్సీ కూడా ప్రభుత్వ సృష్టే అన్నది స్పష్టమవుతోంది. గురువారం మంత్రులు, పోలీసులు విడుదల చేసిన ఫ్లెక్సీ ఫొటోలో హేపీ న్యూ ఇయర్‌ తరువాత రోమన్‌ ‘అండ్‌’ గుర్తు ఒక్కటే ఉండి అనంతరం పొంగల్‌ అని రాసి ఉంది. కానీ శుక్రవారం నాటి పోలీసులు చూపిస్తున్న ఫ్లెక్సీలో రోమన్‌ ‘అండ్‌’తో పాటు కొన్ని పువ్వుల బొమ్మలు కూడా ముద్రించి ఉండడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement