
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి హడావిడిగా తన అనుచరులను పంపి అఖిల సంఘాల సమావేశానికి ఆహ్వానించడం ముమ్మాటికీ రాజకీయ ఎత్తుగడేనని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. హోదా విషయంలో చంద్రబాబు తాను చేసిన పాపాలను అందరికీ పంచాలని చూస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి కంటితుడుపు సమావేశాలకు జనసేన దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు నిజంగా కోరుకునేవారైతే.. మూడేళ్ల కిందటే ఈ అఖిల పక్షం లేదా అఖిల సంఘాల సమావేశం నిర్వహించి ఉండేవారని, కాలం తీరిన తర్వాత మందేసినట్లు ఇప్పుడు సంఘాలను పిలవడం ద్వారా ఎలాంటి ఫలితం ఉండదని, ఈ సంగతి చంద్రబాబుకు కూడా తెలుసని పవన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అఖిల సంఘాలకు పిలుపులు అందిన నేపథ్యంపై స్పందిస్తూ పవన్ మంగళవారం ఒక ప్రకటన విడుదలచేశారు.
పవన్ ప్రకటన ఇదే..