కాంగ్రెస్‌ భూస్థాపితం కావాలి | Central Minister Ananth kumar Fired On Congress party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ భూస్థాపితం కావాలి

Dec 11 2017 8:24 AM | Updated on Mar 18 2019 9:02 PM

Central Minister Ananth kumar Fired On Congress party - Sakshi

బొమ్మనహళ్లి : వచ్చే శాసన సభ ఎన్నికల్లో బెంగళూరు నగరంలో ఉన్న 28 నియోజక వర్గాల్లో 25 సీట్లు గెలవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 150 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్‌పార్టీని భూస్థాపితం చేసి యడ్యూరప్పను ముఖ్యమంత్రిని చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ అన్నారు. బొమ్మనహళ్లి నియోజకవర్గం పుట్టెనహళ్లి వార్డులో ఉన్న ఆర్‌బీఐ మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన బీజేపీ పరివర్తనా ర్యాలీని ఆయన యడ్యూరప్పతో కలిసి ప్రారంభించి మాట్లాడుతూ... సీఎం సిద్దరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ప్రజా సొమ్మును దోపిడీ చేస్తోందని, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు హత్యలకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటి వరకు 25 మంది పైన హిందూ కార్యకర్తలు హత్యకు గురయ్యారని, పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందన్నారు.

బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీ.ఎస్‌.యడ్యూరప్ప మాట్లాడుతూ... బీజేపీ అంటే జైలుకు వెళ్లే పార్టీ అంటున్న సిద్ధుపై బీఎస్‌వై మండిపడ్డారు. సీఎం   ఏసీబీ, సీఓడీలను దుర్వినియోగం చేసుకుంటూ అవినీతి నాయకులకు క్లీన్‌చిట్‌ ఇప్పిస్తున్న సిద్ధు త్వరలో జైలుకు వెళ్లక తప్పదన్నారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ఆర్‌ అశోక్, రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జ్‌ మురళీధర్‌రావు, మాజీ మంత్రి అరవింద లింబావలి,  సీటీ రవి, వీ.సోమణ్ణ,  ఎమ్మెల్యేలు సతీష్‌రెడ్డి, ఎం.కృష్ణప్ప,  రవిసుబ్రమణ్యం,  ఎంపీలు పీసీ మోహన్, శోభాకరందాజ్లే, నటి శ్రుతి, ఎమ్మెల్సీ తార, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు  పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement