‘చంద్రబాబు డ్రామాను ప్రజలు అసహ్యించుకుంటున్నారు’

C Ramachandraiah Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, వైఎస్సార్‌: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈసీ కార్యాలయం వద్ద చేసిన హైడ్రామాను ప్రజలు అసహ్యించుకుంటున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి రామచంద్రయ్య పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేస్తున్న కుట్రలకు హైకోర్టు కూడా మొట్టికాయలు వేసిందని అన్నారు.  చంద్రబాబు వద్ద ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్లాలని సూచించారు. దేశంలో ప్రతి చోట దాడులు చేసే హక్కు ఆదాయపు పన్ను శాఖ వాళ్లకు ఉందని తెలిపారు. పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటకలలో కూడా దాడులు జరిగాయని గుర్తుచేశారు.

చంద్రబాబు పక్కన అందరు అవినీతిపరులు ఉన్నారు కాబట్టే ఐటీ శాఖ దాడులు చేసిందన్నారు. రాజ్యాంగంపై చంద్రబాబుకు నమ్మకం లేదన్నారు. చట్టం తన పని చేసుకోకుండా చంద్రబాబు అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని పబ్లిక్‌గా బెదిరించడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఒక ముఖ్యమంత్రి ఇలాంటి చర్యలకు దిగడం దేశంలో ఇదే తొలి సారి అని పేర్కొన్నారు. చంద్రబాబు తన పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కోడ్‌ అమలులోకి వచ్చాక అధికారుల బదిలీ ఈసీ పరిధిలో ఉంటుందని తెలిపారు. చంద్రబాబు ఓడిపోతామని మందే తెలిసిపోయిందన్నారు. ప్రజలకు సేవ చేస్తున్న అధికారులను చంద్రబాబు అగౌరవ పరచడం హేయమైన చర్యగా అభివర్ణించారు. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌ గురించి చంద్రబాబు దారుణంగా సరైన మాట్లాడటం పద్దతి కాదని హితవు పలికారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top