‘వాళ్లు ప్రజంటేషన్‌ ఇవ్వకుండా వెళ్లిపోయారు’ | Bosta Satyanarayana Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

సింగపూర్‌ ప్రతినిధులు ప్రజంటేషన్‌ ఇవ్వలేదు

Dec 17 2019 5:09 PM | Updated on Dec 17 2019 5:25 PM

Bosta Satyanarayana Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర విభజన కంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన గత ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయిందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణంపై చర్చ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణంపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. గంటకో మాట మారుస్తున్నారని మండిపడ్డారు. సింగపూర్‌ ప్రతినిధులు తమతో కూడా సమావేశమయ్యారని, రాజధాని నిర్మిస్తామంటే తమకు అభ్యంతరం లేదని వారికి చెప్పామన్నారు. కానీ, సంపద ఎలా సృష్టిస్తారో అడిగితే.. ప్రజెంటేష్‌ ఇవ్వకుండా వెళ్లిపోయారని బొత్స తెలిపారు.

సింగపూర్‌తో చంద్రబాబు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. హైటెక్‌ సిటీకి ఎన్‌. జనార్దాన్‌రెడ్డి పౌండేషన్‌ వేస్తే... తానే కట్టానని చంద్రబాబు గొప్పలు చేప్పుకుంటున్నారని విమర్శించారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు ఎవరు కట్టారో అందరికీ తెలుసన్నారు. స్విస్‌ ఛాలెంజ్‌పై ప్రజంటేషన్‌ ఇవ్వమంటే బాబు ఇవ్వలేదని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి మాట్లాడుతూ.. చంద్రబాబు చేసుకున్న ఒప్పందం న్యాయ బద్దమైనది కాదు కనుకే సింగపూర్‌ కంపెనీ వెనక్కి వెళ్లిపోయిందన్నారు. చంద్రబాబు తన అబద్ధాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement