చంద్రబాబును కలిసిన బోండా ఉమ

Bonda Uma Met Chandrababu In Amaravathi - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్‌ నేత బోండా ఉమామహేశ్వరరావు సోమవారం​ కలిశారు. గత కొద్దిరోజులుగా బోండా ఉమ పార్టీ మారాతారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే చంద్రబాబుతో భేటీ వివరాలపై మాత్రం ఆయన పెదవి విప్పలేదు. అయితే ఇప్పటికే చంద్రబాబు సన్నిహితుడు బుద్ధా వెంకన్న కూడా బోండా ఉమాతో మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా తాను పార్టీ మారడం లేదని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే.

లెస్‌ లగేజ్‌మోర్‌ కంఫర్ట్‌..
మరోవైపు విజయవాడ టీడీపీ అర్బన్‌ కార్యాలయం తరలింపుపై ఎంపీ కేశినేని నాని ‘లెస్‌ లగేజ్‌మోర్‌ కంఫర్ట్‌’  అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. కాగా ఇప్పటివరకూ పార్టీ అర్బన్‌ కార్యాలయం కేశినేని భవనంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అర్బన్‌ కార్యాలయాన్ని అక్కడ నుంచి తీసివేసి... ఆటోనగర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలోనే పని చేస్తుందని టీడీపీ ప్రకటన చేసింది.

కాగా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఎంపీ కేశినేని నాని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యాలయం తరలింపు వెనుక బుద్దా వెంకన్న హస్తం ఉన్నట్లు కేశినేని నాని అనుమానిస్తున్నారు. ఇకపై విజయవాడ టీడీపీ అర్బన్‌ కార్యక్రమాలు అన్ని జిల్లా టీడీపీ కార్యాలయం నుంచే జరుగుతాయంటూ సోమవారం మీడియాకు లేఖ విడుదల చేయడంపై బుద్ధా వెంకన్నను ఉద్దేశించి నాని లగేజ్‌ తగ్గితే మరింత సౌకర్యంగా ఉంటుందంటూ ట్విటర్‌లో వ్యంగ్యంగా పోస్ట్‌ పెట్టారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ట్విటర్‌ వేదికగా వార్‌ జరుగుతున్న విషయం విదితమే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top