యూటర్న్‌ అంకుల్‌ అనడంలో తప్పు లేదు..

Bhumana Karunakar Reddy Fires On CM Chandrababu - Sakshi

సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పథకం ప్రకారమే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తమ పార్టీ నాయకులతో మాటల దాడి చేయిస్తున్నారని భూమన కరుణాకర్‌ రెడ్డి ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధించడం కోసం పార్లమెంట్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న విజయసాయి రెడ్డి తీరును బాబు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.

చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీల అవినీతి భాగోతాన్ని విజయసాయి రెడ్డి ఎక్కడ బయటపెడతారో అన్న భయం తెలుగు దేశం పార్టీకి, నాయకులకు నిద్ రలేకుండా చేస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి ఏది చేప్తే అది ఊదరగొట్టే ఎల్లో మీడియాతో ప్రత్యేక హోదా కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న విజయసాయి రెడ్డిపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై పూటకో మాట మాట్లాడే చంద్రబాబును యూటర్న్‌ అంకుల్‌ అనడంలో తప్పు లేదని అన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top