బీసీల ప్రస్తావనేదీ.. | Sakshi
Sakshi News home page

బీసీల ప్రస్తావనేదీ..

Published Thu, Oct 18 2018 4:33 AM

BC Leader R Krishnaiah Fires on CM KCR Over Election Guarantees - Sakshi

హైదరాబాద్‌: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో బీసీల ఆత్మగౌర వాన్ని దెబ్బతీసే విధంగా ఉం దని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నా రు. బీసీలకు ఒక్క పథకం కూడా అందులో ప్రకటిం చలేదని ధ్వజమెత్తారు. మేనిఫెస్టోలో బీసీలకు ఎలాంటి హామీలివ్వకుండా బీసీ వ్యతిరేక వైఖరిని ప్రదర్శించారని విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌ విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీలంటే కేసీఆర్‌కు లెక్కలేదని, ఈ నాలుగున్నరేళ్ల పాలనలో అనేక బీసీ వ్యతిరేకచర్యలకు పాల్పడ్డారన్నారు.   ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను విద్యకు దూరం చేశారని ఆరోపించారు.  చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశంపై కేంద్రంతో పోరాడుతానని చెప్పి ఒక్కసారి కూడా ప్రధానితో మాట్లాడలేదని ఆరోపించారు.

జనాభా ప్రతిపాదికన ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్లు పెంచి బీసీ రిజర్వేషన్లు మాత్రం తొక్కి పెట్టా రని విమర్శించారు. బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలలకు ఒక్క కొత్త భవనం కూడా నిర్మించలేదన్నారు. జనాభా ప్రకారం పంచా యతీ రాజ్‌ రిజర్వేషన్లు పెం చుతామని హామీ ఇచ్చి అనంతరం తగ్గించేందుకు ప్రయత్నించారన్నారు. బీసీలంటే కేసీఆర్‌కు ఓట్లేసే యంత్రాలుగా కనబడుతున్నారన్నారు. కేసీఆర్‌ తన వైఖరిని మార్చుకుని ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకిచ్చే హామీలను స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశం లో బీసీ నేతలు గుజ్జ కృష్ణ, ఎర్ర సత్యనారాయణ, శారదగౌడ్, చెరకు కౌశిక్‌యాదవ్, జంగయ్య యాదవ్, సుమన్‌బాయి పాల్గొన్నారు.   

Advertisement
Advertisement