ఏపీ ఎన్నికలపై అసదుద్దీన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Asaduddin Owaisi Comments on Andhra Pradesh Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రచారం చేయడానికి సిద్ధమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ప్రకటించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆహ్వానిస్తే ఎన్నికల ప్రచారానికి వెళ్తానని చెప్పారు. శనివారం దారుసలాంలో జరిగిన ఎంఐఎం 61వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లను భూస్థాపితం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. (వైరల్‌: చంద్రుడు ఐయామ్‌ కమింగ్‌)

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో టీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌ సీపీ 35 సీట్లు సాధించే అవకాశముందన్నారు. మైనార్టీలంతా వైఎస్సార్‌ సీపీ వెంటే ఉన్నారని అభిప్రాయపడ్డారు. బిహార్‌లోని కిషన్‌గంజ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇక్కడి నుంచి అక్తర్‌ ఉల్‌ ఇమన్‌ పోటీ చేస్తారని అసదుద్దీన్‌ తెలిపారు.

అణుబాంబులు మా దగ్గరా ఉన్నాయ్‌
పాకిస్థాన్‌ పార్లమెంట్‌లో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్‌ స్పందించారు. టిప్పు సుల్తాన్‌ హిందువులకు శత్రువు కాదని అన్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌ అణుబాంబుల గురించి మాట్లాడుతున్నారని.. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. పాకిస్థాన్‌లో ఉన్న లష్కరే, జైషే ఉగ్రవాద సంస్థలను నియంత్రించాలని సూచించారు. (ఇమ్రాన్‌.. అమాయకత్వపు ముసుగు తీసేయ్‌: ఒవైసీ)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top