
సాక్షి, అమరావతి: 2019 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసే పోటీ చేస్తామని బీజేపీ జాతీయ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. ఆదివారం ఓ ఆంగ్ల టీవీ చానెల్‌తో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. టీడీపీ–బీజేపీ బంధం విడదీయరానిదని, వచ్చే ఎన్నికల్లోనూ తమ పొత్తు కొనసాగుతుందన్నారు.
విభజన హామీలకు, ప్యాకేజీకి, బడ్జెట్‌కు సంబంధం లేదని తెలిపారు. రాష్ట్రానికిచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, 2018 బడ్జెట్‌లో ఏపీపై చిన్నచూపు చూశారంటూ సీఎం చంద్రబాబు అసంతృప్తి లీకుల నేపథ్యంలో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేగా టీడీపీతో కలిసే ఉంటామని స్పష్టీకరించారు. ఏపీ ఇచ్చిన హామీలన్నీ తప్పక నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి ఏం చేయాలో తమకు తెలుసన్నారు.