ఢిల్లీలో లాబీయింగా.. హాస్యాస్పదం: ఏపీ మంత్రి

AP Minister Shankar Narayana Slams Chandrababu Over Capital Issue - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి రద్దు పార్లమెంట్‌లో ఆమోదం పొందుతుందని మంత్రి శంకర్‌ నారాయణ పేర్కొన్నారు. మండలి రద్దును అడ్డుకునేందుకు ఢిల్లీలో లాబీయింగ్‌ చేస్తానని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. స్థానికంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శంకర్‌ నారాయణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని విషయంలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రవర్తిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వికేంద్రీకరణ ఆగదని మంత్రి స్పష్టం చేశారు. విశాఖపట్నంపై చంద్రబాబు అండ్‌ టీం దుష్ర్పచారం దుర్మార్గమని మండిపడ్డారు. బోస్టన్‌, జీఎన్‌ రావు కమిటీ నివేదికలను బోగి మంటల్లో వేయాలన్న టీడీపీ నేతలు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని గత టీడీపీ పాలనలో లాయర్లు 90 రోజులు ధర్నాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేయాలని ఎవరడిగారని యనమల వ్యాఖ్యానించడం తగదని మంత్రి శంకర్‌ నారాయణ హెచ్చరించారు.  

చదవండి:
నేను మేనేజ్‌ చేస్తాగా! 

రాజ్యాంగం మేరకే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top