‘నాడు నరకాసురుడు.. నేడు ‘నారా’సురుడు’ | Anam Ramanarayana Reddy Slams Cm Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Nov 6 2018 1:01 PM | Updated on Nov 6 2018 4:50 PM

Anam Ramanarayana Reddy Slams Cm Chandrababu Naidu - Sakshi

నాడు ప్రజలను నరకాసురుడు ఇబ్బంది పెడితే నేడు నారాసురుడు పెడుతున్నాడని..

సాక్షి, హైదరాబాద్‌ : నాడు ప్రజలను నరకాసురుడు ఇబ్బంది పెడితే నేడు నారాసురుడు పెడుతున్నాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఆనం రామనారయణ రెడ్డి తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు పాలన నరకాసురుడిని తలిపిస్తుందన్నారు. బెల్ట్‌ షాపులు తీసేయ్యలేదని, ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగితే పట్టించుకోలేదని, అవినీతి పెరిగిందని, ఇసుకాసురులు పెరిగిపోయారని ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల్లో నారాసురుడి రాజకీయ సంహారంతోనే ఏపీ ప్రజలకు నిజమైన దీపావళి వస్తుందన్నారు. హుదూద్‌, తిత్లీ తుఫాన్‌లతో చంద్రబాబు లబ్దిపోందుతున్నారని ఆరోపించారు. తుఫాన్‌ బాధితులకు ఎదో సాయం చేస్తున్నట్లు బిల్డప్‌ ఇస్తూ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని వ్యవవస్థలు దిగజారిపోయాయన్నారు. ఆపరేషన్‌ గరుడ అని చెప్పిన వ్యక్తిని ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. పోలీస్‌ శాఖలు ఎక్కడ పనిచేస్తున్నాయని, ఇంటలిజెన్స్‌ శాఖ పక్క రాష్ట్రంలో ఓట్లు కొనుగోలు చేయడం ఏంటని నిలదీశారు. యూపీఎలో చంద్రబాబు కొత్తగా కూడగట్టేదేముందని, ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిన చంద్రబాబు రాజకీయ వ్యవస్థను కూల్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఒకటిన్నర లక్షల కోట్ల అ‍ప్పుతో ఏం చేశారని, ఆర్థికంగా చంద్రబాబు, ఆయన కుటుంబం మాత్రమే లాభపడిందని ఆరోపించారు. చంద్రబాబు తీరు గురవింద సామెతను తలపిస్తుందని విమర్శించారు. 

Advertisement
 
Advertisement
Advertisement