ఎమ్మెల్సీలకు దక్కని అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌

Amit Shah Refuses Appointment To TDP MLCs - Sakshi

సాక్షి, విజయవాడ : ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన టీడీపీ ఎమ్మెల్సీలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఊహించని షాక్‌ ఇచ్చారు. ఆ ఎమ్మెల్సీలకు అపాయింట్‌మెంట్‌ ఇ‍వ్వడానికి ఆయన నిరాకరించారు. శాసనమండలి రద్దు నిర్ణయంపై అమిత్‌ షాను కలవాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీ పర్యటన ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్సీలకు పార్టీ అధిష్టానం నుంచి సమాచారం అందింది. అయితే అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ దొరకకపోవడంతో వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. కేవలం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అపాయింట్‌మెంట్ మాత్రమే ఖరారైంది. దీంతో ఇక చేసేదేమీలేక టీడీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. మండలి రద్దుకు సహకరించాలని కోరుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం అమిత్‌ షాను కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. (మండలి రద్దును ఆమోదించండి)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top