ఏం చేద్దాం: ఓటమిపై బీజేపీ అంతర్మథనం | Amit Shah meets leaders to review setback | Sakshi
Sakshi News home page

Dec 13 2018 4:38 PM | Updated on Dec 13 2018 4:53 PM

Amit Shah meets leaders to review setback - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తాజాగా ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలడంతో.. ఆ పార్టీ అధినాయకత్వంలో అంతర్మథనం మొదలైంది. తాజా పరాభవాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్రాల పధాధికారుల సమావేశం ఢిల్లీలో గురువారం ప్రారంభమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, లక్ష్మణ్‌తోపాటు మురళీధర్రావు, ఇతర రాష్ట్రాల సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

తాజాగా నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణాలు విశ్లేషించడం, పార్టీ నాయకత్వంలో, శ్రేణుల్లో మళ్లీ నైతిక ఉత్తేజాన్ని నింపి రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం సిద్ధం చేయడం లక్ష్యంగా అమిత్‌ షా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

Advertisement
 
Advertisement
Advertisement