తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉప విద్యాధి కారుల, మండల విద్యాధికారుల పోస్టులు...
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉప విద్యాధి కారుల, మండల విద్యాధికారుల పోస్టులు గత కొన్ని ఏళ్ల నుంచి భర్తీ చేయకపోవడంతో ఆయా జిల్లాల్లోని డైట్ లెక్చరర్లను, సీనియర్ ప్రధానోపాధ్యాయులను, మం డల విద్యాధికారులుగా నియమించారు. వీరు అటు పాఠ శాలలు, కళాశాలలకు వెళ్లక ఇటు ప్రభుత్వ పాఠశాలలను సరిగ్గా పర్యవేక్షణ చేయకపోవడంతో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. ఉదా హరణకు వరంగల్ జిల్లాలో కేవలం ఇరు వురే రెగ్యులర్ మండల విద్యాధికారులు ఉన్నారు.
మిగతా వారంతా ప్రధానోపాధ్యా యులే ఎంఈఓలుగా కొనసాగుతున్నారు. వీరికి విద్యాప్ర మాణాల మీద ఏ మాత్రం పట్టులేదు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మ డి సర్వీస్ రూల్స్ కారణంగానే రెగ్యులర్ విద్యాధికారుల పోస్టులు ఈ నాటికీ భర్తీకావటం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే విద్యా సంవత్సరం ప్రారంభంలోపు రెగ్యులర్ విద్యాధికారుల పోస్టులను భర్తీ చేసి ప్రాథమిక విద్యను పటిష్టం చేయాలి. విద్యార్థుల ప్రయోజనాలకు ఇది ఎంతో అవసరం.
- కామిడి సతీష్‌రెడ్డి పరకాల, వరంగల్