హైదరాబాద్‌లో ఏడు గల్ఫ్ మెడికల్ సెంటర్లు

7 Gulf medical checkup centers in Hyderabad - Sakshi

గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలయిన సౌదీ అరేబియా, యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్), ఓమాన్, బహ్రెయిన్‌, ఖతార్, కువైట్‌ లతోపాటు యెమెన్‌కు కొత్తగా ఉద్యోగానికి/నివాసానికి వెళ్లాలనుకునే వారు ముందస్తు ఆరోగ్య పరీక్షలు (ప్రీ హెల్త్ చెకప్ - మెడికల్ ఎగ్జామినేషన్) చేయించుకొని మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందాలి. ఇందుకోసం 'గల్ఫ్ హెల్త్ కౌన్సెల్' వెబ్ సైటు https://gcchmc.org/Gcc/Home.aspx ద్వారా ఆన్ లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. గల్ఫ్‌ దేశాలకు వెళ్లేవారికి అంటువ్యాధులు ఏమైనా ఉన్నాయా ? ఎయిడ్స్‌, టీబీ వంటి వ్యాధులు ఉన్నాయా ? వారు ఆరోగ్యంగా ధృడంగా ఉన్నారా..?  అని ఇక్కడ పరీక్ష చేసి మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు. ఆరోగ్యవంతులకు మాత్రమే అరబ్ గల్ఫ్‌ దేశాలకు వెళ్లేందుకు వీసా జారీ అవుతుంది.

'గల్ఫ్ హెల్త్ కౌన్సిల్' వారు భారత దేశంలోని 17 నగరాలలో 114 మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్లకు అనుమతి ఇచ్చారు. మంగుళూరు (4), అహ్మదాబాద్ (4), బెంగుళూరు (5), లక్నో (12), ముంబై (19), చెన్నై (7), ఢిల్లీ (13), హైదరాబాద్ (7), జైపూర్ (5), తిరువనంతపురం (5), తిరుచ్చి (5), కాలికట్ (5), మంజేరి (4), తిరూర్ (4), కొచ్చి (5), గోవా (3), కోల్‌కతా (7) మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి.

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు హైదరాబాద్‌లోని ఈక్రింది ఏడు మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్ల సేవలు వినియోగించుకోవచ్చు. 

మెస్కో డయాగ్నొస్టిక్ సెంటర్, దార్స్ షిఫా ఫోన్: 040 2457 6890
ఈ-మెయిల్: mescodc@hotmail.com

 గుల్షన్ మెడికేర్, అబిడ్స్  ఫోన్: 040 2461 2194
ఈ-మెయిల్: gulshanmedicarehyderabad@gmail.com

 ప్రీతి డయాగ్నొస్టిక్ సెంటర్, మెహిదీపట్నం  ఫోన్: 040 6656 6785  
ఈ-మెయిల్: preethi_kvk@yahoo.com

 సాలస్ హెల్త్ కేర్, హిమాయత్ నగర్  ఫోన్: 040 6625 7698
ఈ-మెయిల్: kasim@doctor.com

ఎస్.కె. మెడికల్ సెంటర్, గోల్కొండ  ఫోన్: 040 6558 7777
ఈ-మెయిల్: skmc7777@hotmail.com 

ఎస్.ఎల్. డయాగ్నోస్టిక్స్, ఖైరతాబాద్  ఫోన్: 040 2337 5235
ఈ-మెయిల్: sldpl@yahoo.co.in

 హైదరాబాద్ డయాగ్నొస్టిక్, సోమాజిగూడ  ఫోన్: 040 2341 4051  
ఈ-మెయిల్: hyderabaddiagnostic@gmail.com 

సేకరణ: మంద భీంరెడ్డి, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం +91 98494 22622 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top