పౌర నిరసనలు : వారంతా ఏమైపోయినట్టు..?

Where Minorities Of Pakistan And Bangladesh Have Gone Asks Amit Shah - Sakshi

పౌరసత్వ నిరసనకారులపై హోంమంత్రి అమిత్‌షా ఫైర్‌

లక్నో : పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిరసనల కారులపై విమర్శలు గుప్పించారు. లక్నోలో మంగళవారం జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత దేశ విభజన అనంతరం  హిందువులు, సిక్కులు, బౌద్ధుల సంఖ్య బంగ్లాదేశ్‌లో 30 శాతం‌, పాకిస్తాన్‌ 23 శాతంగా ఉండేదని చెప్పారు. కానీ, ఆ జనాభా నేడు కేవలం బంగ్లాదేశ్‌లో 7శాతంగా, పాకిస్తాన్‌లో 3 శాతంగా ఉందన్నారు. మరి మిగతా జనాభా ఎటు పోయినట్టని అమిత్‌షా ప్రశ్నించారు.

సీఏఏపై విమర్శలు చేస్తున్న ‘దేశ భక్తులు’ దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాగా, అఫ్గాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ దేశాల్లో అణచివేతకు గురవుతున్న ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 2014 డిసెంబర్‌ 31కి ముందు భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులు సీఏఏ ద్వారా భారత పౌరసత్వం పొందే వీలు కల్పించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top