ఉదకమండలం అతలాకుతలం | Water enters 200 houses, over 50 vehicles washed away in Udhagamandalam | Sakshi
Sakshi News home page

ఉదకమండలం అతలాకుతలం

Mar 8 2015 12:32 PM | Updated on Sep 2 2017 10:31 PM

ఎడతెరిపిలేకుండా అకాల వర్షం కురిసిన కారణంగా తమిళనాడులోని ఉదకమండలంలోగల కొన్ని ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి.

ఎడతెరిపిలేకుండా అకాల వర్షం కురిసిన కారణంగా తమిళనాడులోని ఉదకమండలంలోగల కొన్ని ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. దాదాపు 200కు పైగా నివాసాల్లోకి వర్షపునీరు ప్రవేశించి దెబ్బతినగా 50కిపైగా వాహనాలు కొట్టుకుపోయాయి. దాదాపు 36గంటలపాటు కురిసిన ఈ వర్షం ఆదివారం ఉదయం 8.30కు కాస్త తెరపునిచ్చిందని అక్కడి అధికారులు తెలిపారు. అనుకోకుండా భారీ వర్షం రావడంతో ఏం చేయాలో అర్ధం కాలేదని, అక్కడే ఉన్న కూనూరు నది పొంగి నీరు ఇళ్లలోకి, వీధుల్లోకి చేరిందని తెలిపారు. వాననీటికి కొట్టుకుపోయి ధ్వంసమైన వాహనాల్లో 25 టూ వీలర్స్, పది ఆటో రిక్షాలు, పది కార్లు, ఇతర వాహనాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement