5 నుంచి వందే భారత్‌

Vande Bharat Express To Run For The First Time Between Delhi-Katra from October 5 - Sakshi

న్యూఢిల్లీ: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తొలిసారిగా ఢిల్లీ–కత్రా (జమ్మూకశ్మీర్‌) మధ్య అక్టోబర్‌ 5 నుంచి పరుగులు పెట్టనుంది. ఈ మేరకు టికెట్ల బుకింగ్‌ను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ప్రారంభించినట్లు రైల్వే ఆదివారం ప్రకటించింది. అక్టోబర్‌ 3న హోంమంత్రి అమిత్‌ షా వందే భారత్‌ను ప్రారంభించనున్నారు. కాగా, ఈ హైస్పీడ్‌ రైలు ఢిల్లీ–కత్రా మధ్య ప్రస్తుతమున్న 12 గంటల ప్రయాణ సమయాన్ని 8 గంటలకు తగ్గించనుంది. ఈ రైలులో న్యూఢిల్లీ నుంచి ఆఖరి స్టేషన్‌ అయిన శ్రీ వైష్ణో దేవి కత్రా వరకు ప్రయాణించడానికి కనీస చార్జీలు రూ.1,630 కాగా, గరిష్టంగా రూ.3,015గా నిర్ణయించారు. మంగళవారం తప్ప వారంలో అన్ని రోజులు ఈ రైలు సేవలనందిస్తుంది. ట్రైన్‌ నెం: 22439 న్యూఢిల్లీ–కత్రా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరి, కత్రాకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది. వందే భారత్‌కు మార్గమధ్యలో అంబాలా కంత్, లుథియానా, జమ్మూ తావి స్టేషన్లలో హాల్టింగ్‌ ఉంటుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top