రూ.800 కోట్లతో సైబర్ సెక్యూరిటీ సెంటర్ | UTSA recognized for cybersecurity excellence | Sakshi
Sakshi News home page

రూ.800 కోట్లతో సైబర్ సెక్యూరిటీ సెంటర్

Sep 14 2014 2:12 AM | Updated on Sep 2 2017 1:19 PM

దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కేంద్రం కీలక చర్యలు ప్రారంభించింది.

డిజిటల్ ఇండియాలో భాగంగా
న్యూఢిల్లీ: దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కేంద్రం కీలక చర్యలు ప్రారంభించింది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రూ. 800 కోట్ల వ్యయంతో నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంట ర్‌ను ఏర్పాటు చేయనుంది. ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తయిన సందర్భంగా శనివారం న్యూఢిల్లీలో టెలికం, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తమ శాఖ పనితీరును మీడియాకు వివరించారు.

‘‘రూ. 800 కోట్ల అంచనా వ్యయంతో నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాం. వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాం. దీని సహాయం తో మీ కంప్యూటర్‌లో వైరస్ ఉందా లేదా తెలుసుకోవడమే కాక దానిని తొలగించుకోవచ్చు’’ అని చెప్పారు. దీనితో పాటు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి రూ. 270 కోట్లతో ఈ-గవర్నెన్స్ సెక్యూరిటీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, 2017 నాటికి పూర్తయ్యే ఈ ప్రాజెక్టు సహాయంతో దేశంలోని 2.5 లక్షల పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించనున్నట్టు మంత్రి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement