అతి పెద్ద స్టేడియంలో ‘నమస్తే ట్రంప్‌’..!

Trump Visit To India For Biggest Cricket Stadium And Tajmahal - Sakshi

న్యూఢిల్లీ: ఫిబ్రవరి 24న భారత పర్యటకు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచంలో అత్యంత పెద్దదిగా భావిస్తున్న గుజరాత్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ క్రికెట్‌ స్టేడియాన్ని ప్రధాని మోదీతో కలిసి ఆవిష్కరించనున్నారు. అనంతరం స్టేడియంలో నిర్వహించే ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో ఇరు దేశాధినేతలు పాల్గొంటారు. ఈమేరకు వైట్‌ హౌజ్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘చైనాకు ధీటుగా ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య దేశం భారత్‌’ అని వైట్‌ హౌజ్‌ పేర్కొంది. మొతేరా ప్రాంతంలో నూతనంగా నిర్మించిన సర్దార్‌ వల్లభాయ్‌ క్రికెట్‌ స్టేడియం కెపాసిటీ లక్ష.ట్రంప్‌ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో అమెరికా భద్రతా వాహనాలు అహ్మదాబాద్‌ చేరుకుంటున్నాయి. (ట్రంప్‌ విమాన సౌకర్యాలు చూస్తే మతిపోవాల్సిందే..!)

‘భారత్‌-అమెరికా ప్రజల సంబంధాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమం దానిని పతిబింబించేలా ఉటుందని బీజేపీ జాతీయ  ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ అన్నారు. ట్రంప్‌ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరోస్థాయికి తీసుకెళ్తాయని అన్నారు. ట్రంప్‌నతో కలిసి ఆయన భార్య, అమెరికా మొదటి మహిళా మెలానియా ట్రంప్‌ కూడా భారత్‌లో పర్యటిస్తారు. నమస్తే ట్రంప్‌ కార్యక్రమం అనంతరం వారు తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. (ట్రేడ్‌ డీల్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top