4రోజుల వరస సెలవుల తర్వాత పార్లమెంటు సభాకార్యకలాపాలు బుధవారం నుంచి మళ్లీ ప్రారంభంకానున్నాయి.
♦ న్యూఢిల్లీ: నాలుగు రోజుల వరస సెలవుల తర్వాత పార్లమెంటు సభాకార్యకలాపాలు బుధవారం నుంచి మళ్లీప్రారంభంకానున్నాయి. పాత పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై సభల్లో వాడీవేడీ చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో తమ సభ్యులంతా తప్పక హాజరవ్వాల్సిందిగా బీజేపీ, విపక్ష కాంగ్రెస్ విప్ జారీ చేశాయి.
♦ హైదరాబాద్: ఇవాళ ఉదయం 11 గంటలకు వైఎస్ఆర్సీపీ కేంద్రకార్యాలయంలో టీ-వైఎస్ఆర్సీపీ రంగారెడ్డి కార్యవర్గ సమావేశం జరుగనుంది.
♦ ఢిల్లీ: ఇవాళ సాయంత్రం 6 గంటలకు పార్టీ సీనియర్లతో రాహుల్ గాంధీ భేటీ
♦ అమరావతి: నేటి నుంచి విద్యుత్ పొదుపు వారోత్సవాలు
20వ తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు
♦ కొత్త జిల్లాల అభివృద్ధి ప్రణాళికల తయారీయే లక్ష్యంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేడు జిల్లా కలెక్టర్లతో సమావేశమవుతున్నారు. కొత్తగా నిర్మించిన ముఖ్యమంత్రి అధికారిక నివాస ప్రాంగణంలోని ప్రగతిభవన్ లో బుధవారం ఉదయం 11గంటలకు ఈ సదస్సు ప్రారంభమవుతుంది. జిల్లా కలెక్లర్లతో పాటు ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, జాయింట్ కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ, వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్లు, సబ్ కలెక్టర్లు, అసిస్టెంట్ కలెక్టర్లు ఈ సదస్సుకు హాజరవుతారు.
♦ హైదరాబాద్: రాష్ట్రంలోని ముస్లింలలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల పెంపుదల అంశంపై బుధవారం నుంచి శనివారం వరకు ప్రజా విచారణ అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు రాష్ట్ర బీసీ కమిషన్ తెలిపింది. ఖైరతాబాద్‌లోని వాటర్ వర్క్స్ బిల్డింగ్‌లోని బీసీ కమిషన్ నూతన కార్యాలయ సమావేశ మందిరంలో ఈ నెల 14 నుంచి 17 వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు పబ్లిక్ హియరింగ్‌ను నిర్వహించనున్నారు.
♦ దుబాయ్: నేటి నుంచి వరల్డ్ సూపర్ సిరీస్ మాస్టర్ ఫైనల్స్
ఈ నెల 18వరకు జరగనున్న టోర్నీ
తొలిసారి పోటీ పడుతున్న పీవీ సింధు
భారత షట్లర్ గ్రూప్‌లోనే కరోలినా మారిన్