
పాక్ ప్రధానితో మోడీ చర్చలు సఫలం
పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్తో ప్రధాని నరేంద్ర మోడీ చర్చలు సఫలం అయ్యాయని కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖమంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు.
న్యూఢిల్లీ : పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్తో ప్రధాని నరేంద్ర మోడీ చర్చలు సఫలం అయ్యాయని కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖమంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఆమె బుధవారం విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సుష్మ మాట్లాడుతూ ఉగ్రవాద చర్యలు ఆగితేనే పాక్తో సత్సంబంధాలు ఉంటాయన్నారు.
పొరుగు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకుంటామన్నారు. ప్రపంచంలో సార్క్ దేశాలను బలమైన కూటమిగా నిలబెట్టాలని సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని అమెరికా రావాలని ఒబామా ఆహ్వానించారని సుష్మ తెలిపారు. కాగా కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా అనంత్ కుమార్ బాధ్యతలు చేపట్టారు.