సుప్రీం సీరియస్ | supreme court serious on The destruction of property | Sakshi
Sakshi News home page

సుప్రీం సీరియస్

Feb 25 2016 9:07 AM | Updated on Sep 2 2018 5:24 PM

సుప్రీం సీరియస్ - Sakshi

సుప్రీం సీరియస్

ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం పరిధి దాటినట్లే అవుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

 ఆస్తుల ధ్వంసం చేస్తే కఠిన నిర్ణయం
 ఆందోళకారులకు సుప్రీం హెచ్చరిక
 
న్యూఢిల్లీ: ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం పరిధి దాటినట్లే అవుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. విధ్వంసానికి పాల్పడిన వారిపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొంది. ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పింది. జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా హార్దిక్ పటేల్ సుప్రీం ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు.. పై వ్యాఖ్యలు చేసింది.  నిరసనకారులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను తగులబెట్టే హక్కు లేదంది.

Advertisement
 
Advertisement
Advertisement