కార్డు లేని వారికీ రేషన్‌

States to decide on universal PDS and providing ration to those without card - Sakshi

న్యూఢిల్లీ: రేషన్‌ కార్డు లేని వారికి సైతం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే నిత్యావసరాలను సరఫరా చేసే అంశాన్ని కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు పరిగణనలోనికి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏ రాష్ట్రానికి చెందిన రేషన్‌ కార్డు అయినా యావత్‌ దేశంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇది విధానపరమైన విషయమనీ, భారత ప్రభుత్వం ఇటువంటి సౌకర్యాన్ని కల్పించడానికి పూనుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని బెంచ్‌ ఈ కేసును విచారించింది.

‘సెంట్రల్‌ విస్టా’పై స్టేకు నో
సాక్షి, న్యూఢిల్లీ:
ఢిల్లీలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నూతన పార్లమెంట్,  కేంద్రప్రభుత్వ కార్యాలయాల కొత్త భవనాల  ‘సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు’పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నో చెప్పింది.  ‘కోవిడ్‌ సంక్షోభ సమయంలో ఎవరూ ఏమీ చేయలేరు’అంటూ వ్యాఖ్యానించింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top