
సాక్షి, చెన్నై: 64 ఏళ్ల వయస్సులోనూ ఉరిమే ఉత్సాహంతో యువకుడిలా దూసుకుపోతున్నారు స్టాలిన్.. అటు అధికార పక్షాన్ని గడగడలాడించడంలో, ఇటు డీఎంకే శ్రేణులను నడిపించడంలోనూ జోరు మీదున్న ఆయన సీక్రెట్ ఏమిటి? వయస్సు మీద పడుతున్నా.. ఉత్సాహం, హుషారుతనం తగ్గకుండా ఆయన ఎలా దూసుకెళ్తున్నారంటే.. ఇదిగో సీక్రెట్ ఇదేనంటూ.. ఎంకే సాంకేతిక విభాగం యూట్యూబ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
జిమ్‌లో గంటలు గంటలు ఆయన చేస్తున్న వర్కౌట్స్‌కు సంబంధించిన వీడియో ఇది. ఈ వీడియోలో స్టాలిన్ చేస్తున్న కసరత్తులకు స్ఫూర్తిదాయకమైన ట్యాగ్‌లైన్స్ పెట్టడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు స్టాలిన్‌ను భేష్ అని కొనియాడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై మీరు ఓ లుక్ వేయండి.