ప్రసారభారతి సీఈవోగా శశిశేఖర్‌ వెంపటి | Shashi shhekhar as the CEO of broadcasting officer | Sakshi
Sakshi News home page

ప్రసారభారతి సీఈవోగా శశిశేఖర్‌ వెంపటి

Jun 3 2017 4:16 AM | Updated on Sep 5 2017 12:40 PM

ప్రసారభారతి సీఈవోగా శశిశేఖర్‌ వెంపటి

ప్రసారభారతి సీఈవోగా శశిశేఖర్‌ వెంపటి

ప్రసారభారతి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈవో)గా వెంపటి శశిశేఖర్‌ను నియమిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి అన్సారీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ శుక్రవారం తెలి పింది. సీఈవోగా ఐదేళ్లపాటు కొనసాగనున్న శేఖర్‌ ప్రస్తు తం ప్రసారభారతిలో పార్ట్‌–టైమ్‌ సభ్యులుగా ఉన్నారు.

న్యూఢిల్లీ: ప్రసారభారతి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈవో)గా వెంపటి శశిశేఖర్‌ను నియమిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి అన్సారీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ శుక్రవారం తెలి పింది. సీఈవోగా ఐదేళ్లపాటు కొనసాగనున్న శేఖర్‌ ప్రస్తు తం ప్రసారభారతిలో పార్ట్‌–టైమ్‌ సభ్యులుగా ఉన్నారు.

గతంలో ఇన్ఫోసిస్‌ సంస్థలో పనిచేసిన శేఖర్, ప్రస్తుతం ఓ ఆన్‌లైన్‌ మీడియా సంస్థకూ సారథ్యం వహిస్తున్నారు. ఆయన  ఐఐటీ– ముంబైలో చదువుకున్నారు. కార్పోరేట్‌ మేనేజ్‌మెంట్, టెక్నాలజీ కన్సల్టింగ్, డిజిటల్‌ మీడియాలోఅనుభవం ఉంది. గతంలో ఆడిట్‌ కమిటీ చైర్మన్‌గా, ఫైనాన్స్, అకౌంట్‌ కమిటీ, టెక్నాలజీ కమిటీ, హెచ్‌ఆర్‌ కమిటీల్లో సభ్యునిగా ఉన్నారు. ఇన్ఫోసిస్‌లప్రొడక్ట్‌ స్ట్రాటజిస్ట్‌గా, అమెరికాలో డిజిటల్‌ ఇన్నోవేటర్‌గా సేవలందించారు. ఈ రంగంలో రెండు పేటెంట్లు సాధించారు.

Advertisement
Advertisement