breaking news
vempati Shashi Shekhar
-
డాక్యుమెంటరీ అంతా డొల్లతనమే!
భారత ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ గతవారం ప్రసారం చేసిన డాక్యుమెంటరీ.. ‘ఇండియా : ది మోదీ క్వశ్చన్’ ప్రపంచవ్యాప్తంగా పెను వివాదాన్ని రాజేసింది. డాక్యుమెంటరీపై ఇండియా తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆ లింకులను తక్షణం బ్లాక్ చేయాలని ట్విట్టర్, యూట్యూబ్‌లను ఆదేశించింది. బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ డాక్యుమెంటరీలోని అంశాలను తాను పూర్తిగా అంగీకరించడం లేదని ఇప్పటికే ప్రకటించగా, తాజాగా అమెరికా స్పందించింది. ‘భారత్–అమెరికా’ భాగస్వామ్య విలువలే తమకు ముఖ్యం అంటూ.. వివాదానికి దూరంగా జరిగింది! కాగా, 2002 నాటి గుజరాత్ అల్లర్లు కేంద్ర బిందువుగా బీబీసీ ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన సమయంలోనే భారత్‌లోని ఆ సంస్థ రిపోర్టర్ ఒకరు గత 20 ఏళ్లలో దేశంలో భారీస్థాయి హింసాత్మక సంఘటనలు తగ్గిపోయాయని ఒక కథనం ప్రసారం చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ డాక్యుమెంటరీ వ్యవహారం చూస్తూంటే... మిగతా విపరిణామాలతో పాటూ భారత్‌తో యూకే సంబంధాలూ దెబ్బతినే ప్రమాదం ఉందేమో అనిపిస్తోంది. ‘ద బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్’ (బీబీసీ) యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వ అధికార ప్రజా ప్రసార సంస్థ. రాయల్ ఛార్టర్ కింద ఏర్పాటైంది. బీబీసీకి ఆర్థిక నిధులు ప్రధానంగా యూకే ప్రజల నుంచి వసూలు చేసే లైసెన్స్ ఫీజు ద్వారా అందుతాయి. ఇలా ప్రజల సొమ్ము బీబీసీకి ఇవ్వడంపై ఇటీవల విమర్శలూ వచ్చాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. ప్రేక్షకులు, వీక్షకులు.. ఓటీటీలతో పాటు, ఇతర డిజిటల్ మాధ్యమాల వైపు మళ్లుతూండటం, బీబీసీ సంపాదకీయ వర్గ పోకడలపై తీవ్రమైన ప్రశ్నలు వస్తూండటం, రాజకీయ వివక్ష వంటివి ఆ కారణాల్లో కొన్ని. తాము స్వతంత్రంగానే ఉన్నామని, నిష్పాక్షికంగానే వ్యవహరిస్తున్నామని బీబీసీ చెబు తున్నా దేశపు వ్యూహాత్మక లక్ష్యాల సాధనకు అది బ్రిటిష్ నిఘా వర్గాలకు సాయంగా నిలవడం దశాబ్దాలుగా జరుగుతున్న విషయంబహిరంగ రహస్యం కూడా. వివక్షాపూరితం భారత్‌లో ఇటీవలి కాలంలోనూ బీబీసీ సంపాదకీయ వర్గం పోకడలు వివక్షాపూరితంగా ఉన్న ఆరోపణలు వచ్చాయి. మరీ ముఖ్యంగా ‘సిటిజన్ షిప్ ఎమెండ్మెంట్ యాక్’్టపై ఢిల్లీలో జరిగిన అల్లర్ల విషయంలో బీబీసీ రెచ్చగొట్టేలా వ్యవహరించిందని, కోవిడ్ మరణాలపై కూడా సున్నితంగా వ్యవహరించలేదని ఆరోపణలున్నాయి. అందుకే.. బీబీసీ ప్రధాని నరేంద్రమోదీ, ముస్లిం సమాజాలను కేంద్రంగా చేసు కుని రెండు భాగాల డాక్యుమెంటరీ ప్రసారం చేయాలని నిర్ణయించడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ఈ డాక్యుమెంటరీల్లో తొలి భాగం జనవరి 17వ తేదీ ప్రసారమైంది. ఆ డాక్యుమెంటరీని చూస్తే ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. యూకే ప్రజల సొమ్ముతో నడిచే బీబీసీ... భారత్ లాంటి దేశాల్లో వాణిజ్య అవసరాల కోసమే పనిచేస్తూండవచ్చునని అనుకోవచ్చు. మరిన్ని ఎక్కువ క్లిక్‌లు వచ్చేలా శీర్షికలు పెట్టడం కూడా అందుకే. అయితే 2002 నాటి గుజరాత్ అల్లర్లు కేంద్ర బిందువుగా బీబీసీ ఒక డాక్యుమెంటరీని ప్రసారం చేసిన సమయంలోనే భారత్ లోని ఆ సంస్థ రిపోర్టర్ ఒకరు గత 20 ఏళ్లలో దేశంలో భారీస్థాయి హింసాత్మక సంఘటనలు తగ్గిపోయా యని ఒక కథనం ప్రసారం చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. భారత్‌లో మతాల మధ్య అంతరాన్ని ఉపయోగించుకోవాలని బీబీసీ ఎందుకు అను కుంటోందన్నది పెద్ద ప్రశ్న. అది కూడా పెద్దపెద్ద ఘర్షణలనేవి దాదాపుగా లేని ఈ పరిస్థితుల్లో? ఈ విషయాలను కాసేపు పక్కనబెట్టినా ఈ డాక్యుమెంటరీలో గుజరాత్ అల్లర్ల విషయాన్ని చూపిన విధానంపై మాత్రం నిశిత పరిశీలన జరపాల్సిందే. ఎందుకంటే.. ఈ దేశపు అత్యున్నత న్యాయ స్థానం తన అభిప్రాయాన్ని స్పష్టం చేసిన అంశంపై ఈ డాక్యుమెంటరీ మళ్లీ ప్రశ్నలు లేవనెత్తుతోంది. అంతేకాదు.. భారత్, యూకేల మధ్య దౌత్య సంబంధాలను కూడా దెబ్బతీసేలా ఉందీ డాక్యుమెంటరీ. తొలి భాగం మొత్తం 2002 నాటి గుజరాత్ మతఘర్షణలు తరువాతి పరిణామాలపై తీశారు. బీబీసీ ఆ కాలంలో తీసిన వీడియో ఫుటేజ్‌లు, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతో జరిపిన ఇంట ర్వ్యూలను ఈ డాక్యుమెంటరీలో వాడుకున్నారు. ఇది ఓ తప్పుడు వాదన తాలూకూ పునరుక్తి మినహా మరోటి కాదు. ఈ రకమైన వాదనతోనే అల్లర్లపై ఇరవై ఏళ్లపాటు కోర్టు కేసులు నడిచాయి. ఆ తరువాత సుప్రీంకోర్టు వాటిని చెత్తబుట్టలో వేసేసింది. గుర్తు తెలియని మోదీ వ్యతిరేకులపై ఆధారపడుతూ చేసిన ఈ డాక్యుమెంటరీ కొత్తగా చెప్పేదేమీ లేదు... పాతగాయాలను మళ్లీ రెచ్చగొట్టి కోపం, విద్వేషా లను పెంపొందించడం మినహా! ఘటనల క్రమాన్ని మార్చింది ఈ డాక్యుమెంటరీలోని మొత్తం విషయంలో ఐదు అంశాల గురించి వివరణ అవసరమవుతుంది. మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది ఘటనల క్రమాన్ని మార్చిన విధం. 2002 ఫిబ్రవరిలో జరిగిన గోధ్రా ఘటన తరువాత డిసెంబరులో గుజరాత్ ఎన్నికలు జరిగినట్లు చూపించారు. వర్గాలుగా చీల్చే ప్రయత్నం అన్నమాట. ఈ క్రమంలో సెప్టెంబరులో అక్షరధామ్‌పై జరిగిన ఉగ్రదాడి గురించి అస్సలు ప్రస్తావనే లేదు. అలాగే అక్షరధామ్ దాడి తరువాత పరిస్థితిని అత్యద్భుతంగా చక్కదిద్దిన వైనమూ లేకుండా పోయింది. ఇక రెండో విషయానికి వద్దాం. అది.. హింసకు సంబంధించిన లెక్కల్లోని డొల్లతనం. కొన్ని ఘటనలను పెద్దవిగా చూపేందుకు గ్రాఫిక్‌లు కూడా వేశారు కానీ.. 2002 అల్లర్లను పోలీసులు ఎలా అదుపు చేశారన్న విషయంలో వాస్త వాలను విస్మరించారు. మొత్తం 4,247 కేసులు నమోదయ్యాయనీ, 26,974 మందిని అరెస్ట్ చేశారనీ, గుంపులను చెదరగొట్టేందుకుఏకంగా 15,369 భాష్పవాయు గోళాలు వాడారనీ, తొలి 72 గంట ల్లోనే పోలీసులు 5450 రౌండ్ల బుల్లెట్లు ప్రయోగించిన ఫలితంగా 101 మంది ఆందోళనకారులు మరణించారనీ బీబీసీకి తెలియకుండా ఏమీ ఉండదు. బీబీసీ డాక్యుమెంటరీతో వచ్చిన మూడో చిక్కే మిటంటే.. వాళ్లూ వీళ్లూ చెప్పిన విషయాలపై ఎక్కువగా ఆధార పడటం. సాక్షులు, సాక్ష్యాలు ఏవీ కొత్తగా లేకపోవడం. నిజానికి రెండు దశాబ్దాలపాటు నరేంద్ర మోదీని ఏదో ఒకరకంగా వ్యక్తిగతంగానైనా 2002 అల్లర్లలో ఇరికించాలని బోలెడన్ని ప్రయత్నాలు జరిగాయి. ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు,సందేహాస్పద వ్యక్తుల మాటలపై ఆధారపడి చేసినవే. న్యాయ స్థానాలు వీటి డొల్లతనాన్ని ఎప్పుడో తేల్చేశాయి. ఊరూపేరూ లేని వారి మాటలను వ్యాప్తి చేయడం.. అపవాదులు మోపడం మాత్రమే నని స్పష్టం చేశాయి. నాలుగవ సమస్య గురించి చూద్దాం. ఇందులో వ్యక్తు లను ఉదాహరించిన పద్ధతి ప్రశ్నార్థకమైంది. సుప్రీంకోర్టు సమగ్రతను ప్రశ్నించేలా ఉన్నాయి ఇవి. చివరదైన ఐదవ సమస్య... బ్రిటిష్ దౌత్య కార్యాలయం నిర్వహించిందని చెబుతున్న రహస్య విచారణ. ఇందులో సత్యమెంతో, అవాస్తవాలెన్నో ఎవరికీ తెలియదు. చిచ్చు పెట్టేందుకే... అయితే.. ఈ డాక్యుమెంటరీలో బ్రిటిష్ విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి రహస్య విచారణపై అధికారికంగా ప్రకటన చేయడం వివాదా స్పద పోకడకు శ్రీకారం చుట్టినట్టు అవుతుంది. బీబీసీ తనదైన విదేశీ విధానాన్ని అమలు చేయాలని.. దౌత్యపరమైన ఇబ్బందులతో తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. భారత్‌లో మరోసారి మత ఘర్షణల చిచ్చు పెట్టేందుకు బీబీసీ చేసిన ఈ ప్రయత్నం.. తుది శ్వాస తీసుకుంటున్న తరుణంలో మనుగడ కోసం చేసిన నిష్ఫల ప్రయత్నంగా తోస్తోంది. బీబీసీ అధ్యక్షుడు ఇటీవల బీబీసీ ఏర్పాటు ఉద్దేశాల్లో పబ్లిక్ సర్వీస్ అన్నది తొలిగి పోయేలా ఉందని వ్యాఖ్యానించడం ఇక్కడ చెప్పుకోవాలి. ఈ డాక్యు మెంటరీ వ్యవ హారం చూస్తూంటే... భారతీయ ప్రజాస్వామ్య సుస్థిరతను, అత్యు న్నత ప్రభుత్వ సంస్థల సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ.... బీబీసీ పబ్లిక్ సర్వీసును పూర్తిగా వదులుకోవడమే కాకుండా.. భారత్‌తో యూకే సంబంధాలను కూడా దెబ్బతీస్తున్నట్లు కనిపిస్తోంది. వెంపటి శశి శేఖర్ వ్యాసకర్త ప్రసార భారతి మాజీ ఛైర్మన్ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
ప్రసారభారతి సీఈవోగా శశిశేఖర్ వెంపటి
న్యూఢిల్లీ: ప్రసారభారతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో)గా వెంపటి శశిశేఖర్‌ను నియమిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి అన్సారీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ శుక్రవారం తెలి పింది. సీఈవోగా ఐదేళ్లపాటు కొనసాగనున్న శేఖర్ ప్రస్తు తం ప్రసారభారతిలో పార్ట్–టైమ్ సభ్యులుగా ఉన్నారు. గతంలో ఇన్ఫోసిస్ సంస్థలో పనిచేసిన శేఖర్, ప్రస్తుతం ఓ ఆన్లైన్ మీడియా సంస్థకూ సారథ్యం వహిస్తున్నారు. ఆయన ఐఐటీ– ముంబైలో చదువుకున్నారు. కార్పోరేట్ మేనేజ్మెంట్, టెక్నాలజీ కన్సల్టింగ్, డిజిటల్ మీడియాలోఅనుభవం ఉంది. గతంలో ఆడిట్ కమిటీ చైర్మన్‌గా, ఫైనాన్స్, అకౌంట్ కమిటీ, టెక్నాలజీ కమిటీ, హెచ్ఆర్ కమిటీల్లో సభ్యునిగా ఉన్నారు. ఇన్ఫోసిస్‌లప్రొడక్ట్ స్ట్రాటజిస్ట్‌గా, అమెరికాలో డిజిటల్ ఇన్నోవేటర్‌గా సేవలందించారు. ఈ రంగంలో రెండు పేటెంట్లు సాధించారు.