గుర్తు కోసం మళ్లీ ఈసీ చెంతకు శరద్ | Sharad Yadav submits fresh plea before EC for JD(U) symbol | Sakshi
Sakshi News home page

గుర్తు కోసం మళ్లీ ఈసీ చెంతకు శరద్

Sep 14 2017 8:10 PM | Updated on Sep 19 2017 4:33 PM

పార్టీ గుర్తు కోసం జేడీ(యూ) శరద్‌ యాదవ్‌ వర్గం ఎన్నికల కమిషన్‌కు మరోసారి విజ్ఞప్తి చేసింది.

సాక్షి,న్యూఢిల్లీః పార్టీ గుర్తు కోసం జేడీ(యూ) శరద్‌ యాదవ్‌ వర్గం ఎన్నికల కమిషన్‌కు మరోసారి విజ్ఞప్తి చేసింది. సంబంధిత పత్రాలను సమర్పించేందుకు నాలుగు వారాల గడువు కోరింది. గతంలో తమ క్లెయిమ్‌ను బలపరిచే పత్రాలు లేకపోవడంతో ఈసీ ఆయన వినతిని తోసిపుచ్చింది. శరద్‌ యాదవ్‌ సన్నిహితుడు అరుణ్‌ కుమార్‌ శ్రీవాత్సవ్‌ ఈ వివరాలు వెల్లడించారు.
 
పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఆదివారం ఢిల్లీలో నిర్వహిస్తామన్నారు. పార్టీలో శరద్‌ యాదవ్‌ పట్టును ఈ వేదిక నిరూపిస్తుందని, వచ్చే నెల 8న పార్టీ జాతీయ కౌన్సిల్‌ సమావేశం జరుగుతుందన్నారు. పలు పార్టీ రాష్ర్ట శాఖలు శరద్‌ యాదవ్‌ నేతృత్వంపై విశ్వాసం వ్యక్తం చేశాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement