భార్యకు మొండిచేయి చూపిన లాలూ | Sharad Yadav, Jethmalani, Misa Bharti file papers for RS polls | Sakshi
Sakshi News home page

భార్యకు మొండిచేయి చూపిన లాలూ

May 30 2016 1:50 PM | Updated on Sep 4 2017 1:16 AM

భార్యకు మొండిచేయి చూపిన లాలూ

భార్యకు మొండిచేయి చూపిన లాలూ

లాలూ ప్రసాద్ భార్య రబ్రీదేవిని కాదని కూతురికి రాజ్యసభ సీటు ఇచ్చారు.

పట్నా: బిహార్ లో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సోమవారం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. జేడీ(యూ) నేత శరద్ యాదవ్, ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ, లాలూ ప్రసాద్ తనయ మిసా భారతి, నితీశ్ కుమార్ అనుచరుడు ఆర్సీపీ సింగ్ నామినేషన్లు దాఖలు వేశారు.

లాలూ ప్రసాద్ భార్య రబ్రీదేవిని కాదని కూతురికి  సీటు ఇచ్చారు. సతీమణిని పెద్దల సభకు పంపుతారని వార్తలు వచ్చాయి. దీనిపై సోమవారం సస్పెన్స్ కొనసాగింది చివరకు కూతురివైపే ఆయన మొగ్గుచూపారు. అవినీతి కేసుల్లో తన తరపున వాదించిన జెంఠ్మలానీకి మరొ స్థానం కేటాయించారు. ఆదివారం ఆయన ఆర్జేడీలో చేరారు. తాను లాలూ ప్రసాద్ కు స్నేహితుడిని, రక్షకుడిని అని జెంఠ్మలానీ ప్రకటించుకున్నారు. బీజేపీ తరపున రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోపాల్ నారాయణ్ సింగ్ టికెట్ దక్కించుకున్నారు. ఈ ఐదు స్థానాలు జులైలో ఖాళీ అవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement