రైళ్లలో ఈవ్‌టీజింగ్‌ చేస్తే మూడేళ్ల జైలు

RPF proposes 3-year jail for eve-teasing on trains - Sakshi

న్యూఢిల్లీ: రైళ్లలో మహిళలను వేధించే వారికి కనీసం మూడేళ్ల జైలు శిక్ష పడేలా రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ యోచిస్తోంది. ఈ దిశగా రైల్వే చట్టంలో మార్పులు చేసేలా ప్రతిపాదన తెస్తోంది. ఇది కార్యరూపం దాలిస్తే భారత శిక్షాస్మృతిలో పేర్కొన్న శిక్ష కన్నా.. ఈ శిక్ష భారీగా ఉండే అవకాశం ఉంది. ‘ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే మేం వేగంగా స్పందించేందుకు వీలవుతుంది’’ అని రైల్వే అధికారి ఒకరు చెప్పారు. రైళ్లలో మహిళలపై నేరాలకు సంబంధించి 2014–16 మధ్య కాలంలో 1,607 కేసులు నమోదయ్యాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top