ముంచుకొస్తున్న మాంద్యం.. | Report Reveals India May Register Recession In Q3 Of This Fiscal Over Covid-19 | Sakshi
Sakshi News home page

సరుకులు కొనేందుకు డబ్బులేవి..?

May 24 2020 7:19 PM | Updated on May 24 2020 7:19 PM

Report Reveals India May Register Recession In Q3 Of This Fiscal Over Covid-19 - Sakshi

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారత్‌ ఆర్ధిక మాంద్యం బారిన పడుతుందని తాజా నివేదిక స్ప్టష్టం చేసింది. ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్‌లో ప్రకటించిన చర్యలు సరఫరా మెరుగునకు ఉపయోగపడినా ప్రజల చేతిలో నగదు లేకుంటే సరుకులు, సేవలకు డిమాండ్‌ పెద్దగా ఉండబోదని ఆ నివేదిక పేర్కొంది.

కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో ప్రజల ఆదాయం, ఉద్యోగాలు కోల్పోడం, వినిమయ కార్యకలాపాలు మందగించడంతో మాంద్యం ముప్పు పొంచిఉందని డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ర్టీట్‌ వెల్లడించిన ఎకనమిక్‌ అబ్జర్వర్‌ నివేదిక తెలిపింది. ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్‌ సమర్థ అమలు, ఇది ఎంతకాలం కొనసాగుతుందన్న దానిపై భారత్‌లో ఆర్ధిక వ్యవస్థ రికవరీ ఆధారపడిఉందని పేర్కొంది.

చదవండి : 2.5 కోట్ల ఉద్యోగాలకు కోత

లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసేందుకు తీసుకునే సమయం, ఉద్దీపన ప్యాకేజ్‌ కింద ప్రకటించిన చర్యలను సమర్ధంగా ఎంతకాలం అమలు చేస్తారనేది కీలకమని డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ర్టీట్‌ ఇండియా చీఫ్‌ ఎకనమిస్ట్‌ అరుణ్‌ సింగ్‌ తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజ్‌తో పాటు ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించడం, మారటోరియం వ్యవధిని మరో మూడు నెలలు పొడిగించడం వంటివి కొంత ఉపశమనం కలిగిస్తాయని సింగ్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement